
క్రమశిక్షణ.. లక్ష్య సాధన
విద్యార్థుల ప్రవర్తనపైనా దృష్టి జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన పెద్దపల్లి, గోదావరిఖనిలో పేరెంట్స్, లెక్చరర్స్ సమావేశం
గోదావరిఖనిటౌన్: క్రమశిక్షణ పెంపొందించడం, భవిష్యత్ లక్ష్య సాధనకు ప్రో త్సహించడం ద్వారా విద్యార్థుల భవిష్య త్ బంగారుమయమవుతుందని జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన అన్నారు. గోదావరిఖని శార దానగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం పేరెంట్స్, లెక్చరర్స్ మీటింగ్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ కల్పన, ఉమ్మడి జిల్లా పరిశీలకుడు రమణతో కలిసి నోడల్ అధికారి కల్పన మాట్లాడారు. వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఇంటివద్దే పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపల్ రాజేందర్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణ పెంపొందించాలి
పెద్దపల్లిరూరల్: పదో తరగతి ఉత్తీర్ణ సాధించి.. ఇంటర్మీడియెట్ విద్య కోసం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరే విద్యార్థులు క్రమశిక్షణతో మెలగేలా చూడడంలో తల్లిదండ్రులు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి కోరారు. స్థానిక ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కాలేజీల్లో పేరెంట్, లెక్చరర్ల సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థుల ప్రవర్తనను ఇంటి వద్దనే కాకుండా బయట తిరిగే సమయాల్లోనూ గమనిస్తూ ఉండాలన్నారు. సమావేశంలో ఎన్‌ఎస్‌ఎస్ పీవోలు నరహరి, సదయ్యతోపాటు అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

క్రమశిక్షణ.. లక్ష్య సాధన