
ఓసీపీ–2ను ముంచెత్తిన వరద
నీట మునిగిన కార్యాలయాలు
అధికారుల నిర్లక్ష్యమంటున్న కార్మికులు
రామగిరి(మంథని): రెండురోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో ఓసీపీ–2లోకి వరదనీరు వచ్చి చేరింది. శుక్రవారం వేకువజామున కార్మికులు విధుల్లోకి వచ్చేసరికి ప్రాజెక్ట్ వరద ముంపునకు గురైంది. వ రద ధాటికితోడు సమీపంలోని కాలువకట్ట తెగి ప్రా జెక్ట్‌ను ముంచెత్తింది. ప్రధాన కార్యాలయాలు, ఎస్‌ఎన్‌డీ సెక్షన్, విలువైన యంత్రపరికరాలు గల స్టోర్ గోదాంలు, డంపర్లు, వర్క్‌షాప్, మ్యాన్‌వే, క్యాంటీన్, కార్మికుల రెస్ట్ షెల్టర్లు వరదలో మునిగిపోయా యి. బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. ఓసీపీ–2 బ్యాక్ వాటర్, వరదను కందకాల ద్వారా వేరేప్రాంతానికి తరలించేవారు, కొద్దినెలలుగా కా లువకు అడ్డుకట్ట వేసి మోటార్ల ద్వారా రివర్స్ పంపింగ్ చేస్తూ వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. భారీవర్షాలకు ప్రవాహం పెరిగి గనిలోకి వచ్చిచేరింది. సర్పెస్‌లో ఉద్యోగులు, కార్మికులు మోకాళ్లలోతు నీ టిలోనే విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడ్డారు.
యుద్ధప్రాతిపదికన నీటి తొలగింపు..
రెస్క్యూ టీం గని వద్దకు చేరుకుంది. వరదకు అడ్డుకట్ట వేసి కార్యాలయ్యాల్లోని నీటిని బయటకు తరలిస్తోంది. సింగరేణి ఆర్జీ–3 జీఎం సుధాకర్‌రావు పనులు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ప్రాజెక్ట్ చుట్టూ చేరిన నీటిని ఇంకా తొలగించలేదని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారీవర్షంతో కార్మికుల ప్రాణాలకు ప్రమాదం పొంచిఉందని, డ్రైనేజీ మెరుగుపరచాలని హెచ్చరించాయి.

ఓసీపీ–2ను ముంచెత్తిన వరద