
మహిళలకు ఐలమ్మ స్ఫూర్తి
కలెక్టర్ కోయ శ్రీహర్ష
ఘనంగా వీరనారి జయంతి
పూలమాల వేస్తున్న సీపీ అంబర్ కిశోర్ ఝా
నివాళి అర్పిస్తున్న కలెక్టర్ శ్రీహర్ష తదితరులు
పెద్దపల్లిరూరల్: వీరవనిత చాకలి ఐలమ్మ పోరాటం మహిళలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వీరవనిత ఐల మ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ వేణు హాజరయ్యారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలిగా చాకలి ఐలమ్మ తె లంగాణకు స్ఫూర్తి ఇచ్చారని కలెక్టర్ అన్నారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో..
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సీపీ అంబర్ కిశోర్ ఝా.. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని సీపీ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధపోరా ట యోధురాలు అని కొనియాడారు. ఆనాటి నిరంకుశ రజాకార్లు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా మొక్క వోని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, సీఐ భీమేశ్, ఆర్‌ఐలు దామోదర్, శ్రీనివాస్, వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు ఐలమ్మ స్ఫూర్తి