
మణిద్వీప వర్ణణపూజ
మంథని: పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘం ఆధ్వర్యంలో మణిద్వీప వర్ణనపూజ వైభవంగా నిర్వహించారు. మొత్తం 175 మంది మహిళలు 9 రకాల వస్తువులను పూజల కోసం వినియోగించా రు. ఇందులో చిట్టిగారెలు, గవ్వలు, గోముఖ చక్రా లు, ముత్యాలు, పగడాలు, తామరగింజలు, శంఖువులు, గురిజాలు, నల్లపూసలు 33 చొప్పున ఉపయోగించి పూజ చేశారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు నల్మాస్ ప్రభాకర్, పట్టణాధ్యక్షుడు ఎల్లంకి వంశీధర్, మహిళా సంఘం అధ్యక్షురాలు రాచర్ల తిరుమల, ఆలయ కమిటీ అధ్యక్షుడు కొత్త శ్రీనివా స్, ప్రతినిధులు వొల్లాల సత్యనారాయణ, రేపాల ఉమాదేవి, రావికంటి రేణుక, స్వరూప, ఎల్లంకి రాధిక, రావికంటి మనోహర్, వొల్లాల నాగరాజు, రాచర్ల నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు శిక్షణ
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ జ్యోతిక ఫంక్ష న్ హాల్‌లో శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. జెడ్పీ సీ ఈవో నరేందర్ మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శంగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు. రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండల ఎన్నికల సిబ్బంది హాజరయ్యారు. ఎంఈవోలు మల్లేశం, ఏకాంబరం, విమలతోపాటు అంతర్గాం ఎంపీడీవో మదన్‌మోహన్, మాస్టర్ ట్రైనర్లు అంజన్ కుమార్, జక్కం శ్రీనివాసులు పాల్గొన్నారు.

మణిద్వీప వర్ణణపూజ