
సద్దుల బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు
● అధికారులతో ఎమ్మెల్యే విజయరమణారావు సమీక్ష
పెద్దపల్లిరూరల్: నియోజకవర్గంలో సద్దుల బతుక మ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో, ఎంపీవోలతో ఆ యన సమావేశమయ్యారు. బతుకమ్మ ఆడే, నిమజ్జ న ప్రాంతాల్లో స్థలాలు చదును చేయాలన్నారు. వి ద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. దసరా ఉ త్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నా రు. పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వ రకు రూ.కోటి 80లక్షల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఆయన ప్రారంభించారు. పట్టణ శివారు చందపల్లిలో అమృత్ పథకం ద్వారా రూ.కోటి 3లక్షల వ్యయంతో చేపట్టిన వాటర్‌ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.