
మొగిలిపేటలో కుల బహిష్కరణ
మల్లాపూర్(కోరుట్ల): కుల సంఘంలో ఓ నలుగురు పెద్దమనుషులు చెప్పిన మాట వినలేదని.. ఓ మహిళా కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి క థనం ప్రకారం.. మొగిలిపేటలో ముదిరాజ్ కులాని కి చెందిన ఓనవేని నర్సయ్య–భూమక్క దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడైన ఓనవేని దశరథం–సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. దశరథంకు చెందిన ఇంటి అమ్మకానికి సంబంధించి 2018లో అదేకూలానికి చెందిన ఒకరితో గొడవలు జరుగుతున్నాయి. వివాదం పరిష్కరానికి కు ల పెద్దల వద్దకు వెళ్లడంతో సమస్య పరిష్కారం కా కపోవడంతో అదే సంవత్సరం కుల బహిష్కరణ చే శారు. ఇక నుంచి దశరథం కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నామన్నారు. ఎవరైనా వారితో మాట్లాడటం, వారి ఇంటికి వెళ్లడం లాంటివి చేయొద్దని హెచ్చరించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో దశరథం భార్య సుజాత ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. అప్పటి నుంచి దశరథం కుటుంబం తీవ్ర మనస్థాపానికి గురవుతూ ఇబ్బందులు పడుతున్నా రు. గతేడాది దశరథం ఉపాధి కోసం గల్ఫ్‌కు వలస వెళ్లగా, కుల బహిష్కరణ కేసుతో ఇబ్బంది పడుతు న్న పెద్దలు అతని భార్య సుజాత కేసును వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రా రంభించారు. కులపెద్దల మాటను ధిక్కరించినందుకు సుజాత కులసభ్యుందరి కాళ్లు మొక్కి క్షమించాలని వేడుకుంటే తిరిగి కులంలోకి చేర్చుకుంటా మని సమాచారం పంపించారు. క్షమాపణ అడగన ని సుజాత చెప్పడంతో 15రోజుల క్రితం కులసంఘంలోని ఓ నలుగురు పెద్దలు ఆ కుటుంబంతో ఎ వరు మాట్లాడినా రూ.50వేల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. అధికారులు స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.