
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచేందుకు చర్యలు రైతులతో ముఖాముఖీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ రైతుల అభిప్రాయాలు సేకరణ
ముఖాముఖీకి హాజరైన మంత్రి అడ్లూరి, విప్ శ్రీనివాస్‌కు చెరుకు గడ అందిస్తున్న కాంగ్రెస్ నేతలు
ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీలో నిర్వహించిన ముఖాముఖీకి హాజరైన రైతులు
ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీలో యంత్రాల స్థితిగతులపై ఆరా తీస్తున్న సంజయ్‌కుమార్
మల్లాపూర్(కోరుట్ల): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునర్ ప్రారంభించేందుకు గల ఏర్పాట్లు, రైతులతో శుక్రవారం నిర్వహించిన ముఖాముఖీలో పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్‌రావు, షుగర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నర్సిరెడ్డిలతో కలిసి హాజరయ్యారు. ముందుగా షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించారు. అనంతరం ఓ పంక్షన్‌హాల్‌లో నిర్వహించిన రైతులతో ముఖాముఖీలో మంత్రి మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు రూ.172 కోట్ల బకాయిలు చెల్లించినట్లు తెలిపారు. ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి అవసరమైన సాంకేతికత, స్థానిక సమస్యలపై రైతుల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వాని నివేదించనున్నట్లు పేర్కొన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభమైతే జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల రైతులకు మేలు కలుగుతుందన్నారు. ఫ్యాక్టరీని ప్రారంభించాలంటే రైతులు కనీసం 10 వేల ఎకరాల్లో చెరుకు పంటను సాగు చేయాలని కోరారు. మాజీ మంత్రి, పునరుద్ధరణ కమిటీ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతు ముత్యంపేటలో 1981లో ఫ్యాక్టరీ ఏర్పాటైందని, 2002లో అప్పటి ప్రభుత్వం 51 శాతాన్ని ప్రవేటీకరణ చేసిందని, 2015లో నష్టాలు, చెరుకు పంట లేదని మూసివేశారన్నారు. ఈ ప్రాంత రైతులకు లాభసాటిగా ఉండేలా ప్రభుత్వం రాయితీలు అందించి ప్రోత్సహిస్తే ఫ్యాక్టరీకి అవసరమైన చెరుకు పంటను పండిస్తారన్నారు. వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయశాఖకు సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించి విత్తన సబ్సిడీలు అందిస్తుందని తెలిపారు. చెరుకు పంటను డ్రిప్ ద్వారా పండిస్తే నీటి వినియోగం తగ్గి నీటి వనరులను కాపాడినట్లేనన్నారు. పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ సందర్శన, రైతుల ముఖాముఖీలో చర్చించిన అంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముత్యంపేట ఫ్యాక్టరీలో పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడే సమయానికి నష్టాలతోపాటు క్రషింగ్‌కు అవసరమైన చెరుకు సాగు కావడం లేదన్నారు. రైతులు సహకార సంఘంగా ఏర్పడితే ఫ్యాక్టరీని బాగు చేయించి అప్పగించేందుకు సిద్ధమని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించేందుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ రాములు, కాంగ్రెస్ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగారావు, రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి విజయ్ ఆజాద్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ కో–ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతిరెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుల అభిప్రాయాలు ఇవీ..

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం