ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మిక సంఘ్ విజయం కార్మికుల విజయం. 35 ఏళ్ల తర్వాత బీఎంఎస్‌ను గెలిపించడం ఆనందంగా ఉంది. ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాజకీయాలకతీతంగా అంకితభావంతో పని చేస్తాం. – భాస్కర్‌రెడ్డి,
ఎన్టీపీసీ కార్మిక సంఘ్ అధ్యక్షుడు
ఎన్నికలు ప్రశాంతం
ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసింది. ఎన్టీపీసీ రామగుండం అధికారులు, ఎస్సై ఉదయ్‌కిరణ్ పర్యవేక్షణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
– బిజయ్‌కుమార్ సిగ్దర్,
ఎన్టీపీసీ ఏజీఎం
కార్మికుల విజయం