
ఎమ్మెల్యే చొరవ.. 50 వేలమెట్రిక్ టన్నులు కేటాయింపు
సుల్తానాబాద్(పెద్దపల్లి): గోదాముల్లో స్టాకు ఉందనే సాకుతో అధికారులు రైస్‌మిల్లులకు బాయిల్డ్ బియ్యం కేటాయించలేదు. అధికారుల చుట్టూ యాజమాన్యం తిరిగినా ఫలితం లేకపోవడంతో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును ఆశ్రయించారు. రెండు సంఘాలుగా ఉన్న రైస్‌మిల్ అసోసియేషన్ ప్రతినిధులను కలుపుకొని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్‌రెడ్డి, సివిల్ సపప్లయి కమిషనర్ చౌహన్‌తో బుధవారం చర్చలు జరిపారు.
జిల్లాకు 50 వేల మెట్రిక్ టన్నులు..
2024–25 రబీ సీజన్‌కు జిల్లావ్యాప్తంగా ఉన్న రైస్‌మిల్లులకు 4.64 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు. వాటి ద్వారా ఇప్పటికే యాజమాన్యాలు 55శాతం బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. మరిన్ని ధాన్యం నిల్వలు ఉండి కేటాయించకపోవడంతో యాజమాన్యాలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. చర్యలతో జిల్లావ్యాప్తంగా ఉన్న 148 రైస్‌మిల్లులకు 50 వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ బియ్యాన్ని కేటాయించినట్లు సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. కాగా బాయిల్డ్ బియ్యానికి ఇచ్చిన విధంగా అనే రా బియ్యానికి కూడా అనుమతులు ఇవ్వాలని ఎఫ్‌సీఐ అధికారులను మిల్లర్లు కోరుతున్నారు. కాగా రైస్‌మిల్ అసోసియేషన్ 2 గ్రూపులుగా విడిపోయింది. ఎమ్మెల్యే చొరవతో రెండు గ్రూపులు కలిసి సమస్య పరిష్కారానికి గురువారం హైదరాబాద్ వెళ్లాయి. రెండు సంఘాల జిల్లా అధ్యక్షులు నగునూరి అశోక్‌కుమార్, మోరపల్లి తిరుపతిరెడ్డి, ముస్త్యాల రాజన్న, జయపాల్‌రెడ్డి చీటీ కేశవరావు, మాడూరి ప్రసాద్, పల్లా వాసు, సముద్రాల ధర్మేందర్ తదితరులు ఉన్నారు. బాయిల్డ్ బియ్యం కేటాయించేలా చొరవ తీసుకున్న మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపారు.