
ఏటీసీ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
రామగుండం/కోల్‌సిటీ: నగరంలోని అడ్వాన్స్ ట్రెనింగ్ సెంటర్ (ఏటీసీ)ను గురువారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ సందర్శించారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏటీసీలను వర్చువల్ విధానంలో ప్రారంభించను న్న నేపథ్యంలో ముందస్తుగా స్థానిక ఏటీసీని సందర్శించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యా విధానంలో మూస పద్ధతికి స్వస్థి పలికి చదివే చదువు ఉపాధికి అనుగుణంగా ఉండేలా వివిధ కంపెనీలు త మకు అవసరమైన మానవ వనరులను తయారు చే సుకునేందుకు ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇందులో వివిధ రంగాలపై యు వత కు శిక్షణ కల్పించి నైపుణ్యం ఆధారంగా ఉపాధి క ల్పించేందుకు ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందం చేసుకుందన్నారు. అలాగే గోదావరిఖని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)ని ఎమ్మెల్యే సందర్శించారు. గ్రౌండ్ ఫ్లోర్ అధ్వానంగా ఉందని, ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సూపరింటెండెంట్ అర్చన, ఆర్‌ఎంవో రాజును ఆదేశించా రు. ఆస్పత్రిలో పారిశుధ్యం మెరుగుపర్చాలన్నారు.