
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ధర్మారం(ధర్మపురి): గ్రామాల అభివృద్ధే ధ్యేయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. బుచ్చయ్యపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనం, ఖిలావనపర్తి శ్రీలక్ష్మీనర్సింహస్వామి కళ్యాణ మండపం వద్ద రూ.15 లక్షలతో నిర్మించే వంటశాలకు భూమిపూజ చేశారు. రామయ్యపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పోల్‌దాసరి సంతోష్, పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, యువజనకాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.