ఏమిటీ భవిష్యనిధి? | - | Sakshi
Sakshi News home page

ఏమిటీ భవిష్యనిధి?

Sep 25 2025 12:26 PM | Updated on Sep 25 2025 12:26 PM

ఏమిటీ

ఏమిటీ భవిష్యనిధి?

ఎందుకీ నిధుల కేటాయింపు? సింగరేణిలో సర్వత్రా ఆసక్తి ‘ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’పై చర్చ గతంలోనూ భవిష్యత్‌ కేటాయింపులు తాజాగా అధిక కేటాయింపులపై కార్మికులు, కార్మిక సంఘాల ఆందోళన

గోదావరిఖని: ఏమిటీ ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌.. ఎందుకోసం ప్రొవిజన్‌ కేటాయింపు? ఈనిధులను ఏం చేస్తారు? లాభాల వాటా ప్రకటనతోపాటు ప్రొవిజన్‌ పేరిట భారీ కేటాయింపులు ఎందుకు? అనే అంశాలు సింగరేణి బొగు గనుల్లో లోతైన చర్చకు దారితీశాయి. అంతేకాదు.. రెండేళ్లలో భారీమొత్తంలో కేటాయించడం ఎందుకనే ప్రశ్నకు ఊతమిచ్చినట్లయ్యింది. పదేళ్లుగా ఏటా లాభాల వాటా ప్రకటిస్తున్న సింగరేణి.. ఇదే సమయంలో అందులోంచి బ్యాక్‌ఫిల్లింగ్‌, ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట నిధు లు కేటాయిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

భారీ కేటాయింపులపై చర్చ..

గతంలో బ్యాక్‌ఫిల్లింగ్‌, ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ఇన్‌కంట్యాక్స్‌ తదితర ఖర్చులు పోను లాభాల ప్రకట న చేసేవారు. ఇప్పుడు మొత్తం లాభాలు ప్రకటించి ప్రొవిజన్‌ పేరిట అందులోంచి అధిక మొత్తంలో ని ధులు పక్కన పెడుతున్నారు. లాభాల్లో 34 శాతం కార్మికులకు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రూ.6,394 కోట్లపై 34 శాతం వాటా కేటాయించాలనేది కార్మిక సంఘాలు, కార్మికుల డి మాండ్‌గా ఉంది. లాభాల్లో భారీగా కోత విధించి తక్కువ వాటా ఇచ్చారనే వాదన వస్తోంది. ఈక్రమంలో కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు తీవ్రతరం చేశాయి. అయితే, బొగ్గు గనుల సంస్థ భవిష్యత్‌ ముఖ్యమని, లాభాల వాటా హక్కు కాదని, ప్రభుత్వం ప్రకటించే నజరానా అని సింగరేణి యాజమాన్యం చెబుతోంది. దీనిపై డిమాండ్‌ చేయడం ఏమిటని యాజమాన్యం ప్రశ్నిస్తోంది.

లాభాల వాటా ప్రస్థానం ఇలా..

సింగరేణి సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించడం పాతికేళ్ల క్రితమే ప్రారంభమైంది. అ ప్పటి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) అధ్యక్షుడు కేఎల్‌ మహేంద్ర, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో హైదరాబాద్‌లో జరిగిన చర్చల్లో లా భాల వాటా ప్రస్తావన తెరపైకి తీసుకు వచ్చారు. ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టు (ఓసీపీ)లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 13రోజుల పాటు సమ్మె చేయడంతో అప్పటి సీఎం.. హైదరాబాద్‌ పిలిపించి గుర్తింపు యూనియన్‌ ఏఐటీయూసీతో చర్చించారు. ‘మీ తీరువల్లే సింగరేణి బొగ్గు గనుల సంస్థ నష్టాల పాలవుతోందని ముఖ్యమంత్రి నేతలపై మండిపడ్డారు. దీంతో ‘సింగరేణికి లాభాలు వస్తే మాకేమిట’ని యూనియన్‌ నేతలు వెంటనే సీఎంను ప్రశ్నించారు. స్పందించిన ప్రభుత్వం.. సింగరేణి లాభాలు సాధిస్తే లాభాల్లో 10 శాతం వాటా ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో 2000 సంవత్సరం నుంచి సింగరేణి సాధించే లా భాల్లో వాటా కార్మికులకు చెల్లించడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ వాటా 34 శాతానికి చేరుకుంది.

కొత్తగనుల కోసమే..

2023–24లో ప్రొవిజన్‌ నిధులు రూ.2,289కోట్లు యాజమాన్యం పక్కన పెట్టింది. వీటిలో రూ.1,250 కోట్లతో 250 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల సో లార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు వెచ్చించింది. మరో రూ. 300కోట్లు వెచ్చించి 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌ స్థాపిస్తారు. భూసేకరణ ఇతర పనుల కోసం రూ. 900కోట్లు పెట్టుబడి పెట్టినట్లుగా యాజమాన్యం చెబుతోంది. ఈసారి రూ.4,034కోట్లు కూడా భవిష్యత్‌ అవసరాల కోసం వినియోగిస్తామంటోంది.

భవిష్యత్‌ భద్రతకే..

ప్రొవిజన్‌ పేరిట కేటాయించిన నిధులను కొత్త ప్రాజెక్టుల కోసం వినియోగిస్తాం. ఈపక్రియ ఏటా కొనసాగుతుంది. గతేడాది కేటాయించిన నిధులతో 250 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం స్థాపన, భూసేకరణ, సీహెచ్‌పీల నిర్మాణం కోసం వెచ్చించాం. సింగరేణి ప్రగతి, భవిష్యత్‌ భద్రతకే లాభాల్లోంచి ఇలా నిధులు ప్రత్యేకంగా కేటాయిస్తున్నాం. సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ పనులు పూర్తయితే సింగరేణికి ఏటా రూ.200 కోట్లు మిగులుతాయి.

– ఎన్‌.బలరాం, సీఎండీ, సింగరేణి

రెండేళ్లలో కేటాయింపులు

ఏడాది లాభాలు ప్రొవిజన్‌ (రూ.కోట్లలో) (రూ.కోట్లలో)

2023–24 4,701.30 2,289.00

2024–25 6,394.00 4,034.00

ఏమిటీ భవిష్యనిధి? 1
1/1

ఏమిటీ భవిష్యనిధి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement