పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీగణపతి సంతోషిమాత ఆలయంలో దుర్గామాత బుధవారం అన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో చండీయాగం నిర్వహించారు.
పెద్దచెరువుకు పర్యాటక శోభ
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): గర్రెపల్లి పెద్దచెరువుకు పర్యాక శోభ తెచ్చేందుకు నిర్వాహకు లు నిర్ణయించారు. ఇందులో భాగంగా అధ్యా త్మికత పంచేలా భారీఎత్తున శివుని విగ్రహం నిర్మిస్తున్నారు. విగ్రహ నిర్మాణం చివరిదశలో ఉంది. ఈనెల 29న ఎమ్మెల్యే విజయరమణారావు.. విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని నిర్వాహకులు కన్నం రమేశ్, ఆసరి రాజయ్య, ఎడ్ల రవి, పడాల శ్రీను, పడాల రంగస్వామి తెలిపారు.
పెరటికోళ్ల పెంపకంపై గ్రామస్తులకు అవగాహన
ముత్తారం(మంథని): రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో పెరటికోళ్ల పెంపకంపై అవగాహన కల్పించారు. డీఆర్డీవో కాళిందిని మాట్లా డుతూ, పోషకాహార భద్రత, మహిళల్లో స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించేలా పెరటికోళ్ల పెంపకం చేపట్టాలన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న కృషి విజ్ఞాన కేంద్రం.. సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు భాస్కరరావు, వినోద్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పాల్గొన్నారు.
1,258 మంది కార్మికులకు జనరల్ అసిస్టెంట్ హోదా
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల్లోని 1,258 మంది బదిలీ వర్కర్లను పర్మినెంట్ చేస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు సంస్థ సీఎండీ బలరాం బుధవారం ఉత్తర్వులిచ్చారు. బదిలీ వర్కర్లుగా చేరి ఏడా దిలో భూగర్భగనిలో 190, ఓసీపీలో 240 మస్టర్లు పూర్తిచేసిన కార్మికులను జనరల్ అసి స్టెంట్ కేటగిరీ–1గా క్రమబద్ధీకరించనున్నారు.
రైల్వే ఉద్యోగులకు బోనస్
రామగుండం: కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు బుధవారం దసరా బోనస్ ప్రకటించింది. 78 రోజుల ఉత్పత్తి ఆధారంగా బోనస్ చె ల్లించనున్నట్లు వెల్లడించింది. ఫలితంగా కొన్ని క్యాటగిరీ ఉద్యోగుల్లో ఒకొక్కక్కరికి రూ.17,951 చొప్పున బోనస్ అందనుంది. దీనిపై ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
గుంజపడుగులో మరోసారి సీబీఐ విచారణ
మంథనిరూరల్: గుంజపడుగు గ్రామంలో సీబీఐ రెండోసారి బుధవారం విచారణ చేపట్టింది. గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయ వాది గట్టు వామన్‌రావు – నాగమణి దంపతుల హత్య విషయంలో సీబీఐ అధికారులు సుమారు ఆరు గంటల పాటు విచారణ జరిపినట్లు తెలిసింది. రెండురోజుల క్రితం వామన్‌రావు తల్లిదండ్రులు, సోదరుడిని విచారించిన అధికారులు.. కల్వచర్లలోని ఘటనా స్థలాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణదేవిగా అమ్మవారు