
పదేళ్ల గోసతీర్చిన ప్రజాప్రభుత్వం
● ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ధనార్జనే ధ్యేయంగా ప్రజల ను గోస పెట్టుకున్నదని, కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చాక ప్రజా సమస్యలు పరిష్కరించిందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. అందుగులపల్లి, దే వునిపల్లిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కు ముగ్గు పోసి మాట్లాడారు. రేషన్‌కార్డుల కోసం పేదలు దరఖాస్తు చేసుకుని ఏళ్లుగా నిరీక్షించినా బీఆర్‌ఎస్ పాలకులు పట్టించుకోలేదని, సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం అర్హులందరి కీ రేషన్‌కార్డులుజారీ చేస్తోందని తెలిపారు. స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కే అండగా నిలవాలని ఆయన కోరారు. నాయకులు బొక్కల సంతోష్, గొడ్డేటి రాజయ్య, గౌస్, సాగర్, లక్ష్మణ్, అశోక్, ఆరె సంతోష్, రాజేందర్, సంపత్ తదితరులు ఉన్నారు.
ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ
సుల్తానాబాద్/జూలపల్లి(పెద్దపల్లి): పేద కుటుంబా ల్లోని ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జూలపల్లి ఎంపీడీవో కార్యాలయంలో తహసీల్దారు స్వర్ణతో క లిసి 49 మందికి రూ.49,05,684 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అ దేవిధంగా సుల్తానాబాద్‌లో 96 మందికి రూ. 96,11,136 విలువైన చెక్కులు అందజేసి మాట్లాడా రు. అభివృద్ధి ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమ న్నారు. సుల్తానాబాద్, ఇన్‌చార్జి తహసీల్దార్ రాకేశ్‌తోపాటు ప్రతినిధులు మినుపాల ప్రకాశ్‌రావు, గణే శ్, మహేందర్, శ్రీగిరి శ్రీనివాస్, రవీందర్, బిరుదు కృష్ణ, బండారి రమేశ్, రమేశ్‌గౌడ్, పడాల అజయ్ గౌడ్, అమిరిశెట్టి తిరుపతి, రాజలింగు, గండు సంజీవ్, వేణుగోపాలరావు, శేషయ్యసూరి, దండె వెంకటేశం, నర్సింహయాదవ్, జలపతిరెడ్డి పాల్గొన్నారు.