
జ్వరాలపై నిర్లక్ష్యం వద్దు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
మంథని/రామగిరి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే జ్వరపీడితులను నిర్లక్ష్యం చేయకుండా, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంథని, రామగిరి మండలాల్లో బుధవారం ఆయన పర్యటించారు. మంథని ప్రభుత్వ ఆస్పత్రి, జేబీఎస్, జెడ్పీ బాలికల హైస్కూల్, గురుకుల పాఠశాల, రామగిరి మండలం రత్నాపూర్ ఎంపీపీఎస్, బేగంపేట జెడ్పీహెచ్ ఎస్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ, సీజనల్ వ్యాధిగస్తులకు నిర్ధారణ పరీక్షలు చేసి వైద్యసేవలు అందించాలన్నారు. ఓపీ సమయంలో వైద్యులు పూర్తిసమయం కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభి వృద్ధి పనులను వెంటనే ప్రారంభి పూర్తి చేయాలని ఆదేశించారు. మంథని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్, మంథని, రామగిరి పీఆర్ ఏఈలు అనుదీప్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నియమించిన ప్రిసైడింగ్ అధికారులకు ఈనెల 26, 27వ తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 26న ఉదయం 10 గంటలకు ధర్మారం వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఎలిగేడు, జూలపల్లి, ధర్మారం మండలాల అధికారులకు, కలెక్టరేట్‌లో పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలాలకు చెందిన అధికారులకు శిక్షణ ఉంటుందన్నారు. 27న సుల్తానాబాద్‌లోని యశోద నరహరి ఫంక్షన్ హాల్‌లో ఓదెల, సుల్తానాబాద్ మండలాలు, మంథని జేఎన్టీయూలో కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం, మంథని మండలాల ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తారని కలెక్టర్ వివరించారు.