
కార్మికుల శ్రమ దోచుకుంటున్న కాంగ్రెస్
గోదావరిఖని: రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి కలిసి కార్మికుల శ్రమ దోచుకుంటున్నాయని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రూ.2,200 కోట్ల లాభాలు వస్తే అందులోంచి రూ.710కోట్ల లాభాలను కార్మికులను పంపిణీ చే శామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.4 వేల కోట్ల లాభాలు వస్తే అందులో కేవలం రూ. 798కోట్లు మాత్రమే కార్మికులకు పంచారన్నారు. 2023–24లో పక్కన పెట్టిన సుమారు రూ.2వేల కోట్లు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. గతేడాది రూ.6వేల కోట్లకుపైగా లాభం వస్తే రూ.802కోట్లు మాత్రమే కార్మికులకు పంచారని మండిపడ్డారు. డీఎంఎఫ్‌టీ, రాజీవ్ అభయ హస్తం పేరిట సింగరే ణి సొమ్మును ఇతర పథకాలకు మళ్లిస్తున్న యాజమాన్యం.. కార్మికులు సాధించిన లాభాల్లో పూర్తిస్థా యి వాటా ఇస్తే తప్పేమిటని ఆయన నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే జీడీకే–5 ఓసీపీ మూసివేయాలని ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారని చందర్ ప్రశ్నించారు. నాయకులు నడిపెల్లి మురళీధర్‌రావు, గోపు ఆయిలయ్యయాదవ్, ముద్ద సాని సంధ్యారెడ్డి, బాలరాజు, కుమార్‌నాయక్, ముక్కెర మొగిలి తదితరులు పాల్గొన్నారు.