
తండాల అభివృద్ధికి నిధులు
● ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మారం(ధర్మపురి): వెనుకబడిన గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.740 కోట్లు కేటాయించిందని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. ధర్మపురి మండలం మల్లాపూర్ – పెగడపల్లి మండలం కీచులాటపల్లి మధ్య చేపట్టిన బైపాస్ రోడ్డు పనులను బుధవారం ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. రోడ్డు వెడల్పు 14 అడుగులు ఉంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఉంటాయని, వేడ ల్పు ఇంకా పెంచాలని, ఇందుకు అవసరమైన అంచనాలు తయారు చేస్తే వెంటనే నిధులు విడుదల చేయిస్తానని మంత్రి అన్నారు. ధర్మపురి నియోజవర్గంలోనూ వివిధ అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందిస్తే నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, పత్తిపాక సింగిల్‌విండో చైర్మన్ నోముల వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహులు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోగాల తిరుపతి, మాజీ అధ్యక్షుడు గందం మహిపాల్, నాయకులు చింతల ప్రదీప్‌రెడ్డి, అసోద అజయ్, రామడుగు గంగారెడ్డి, పాలమాకుల రాజు, నిబ్బినాయక్ మహేందర్‌యాదవ్, పోలవేని స్వామి తదితరులు పాల్గొన్నారు.