
పరిహారం చెల్లించాకే పనులు
మంథనిరూరల్: తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాకే గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు చేయాలని చల్లపల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఈమేరకు చల్లపల్లిలో చేపట్టిన హైవే పనులను బుధవారం వారు అడ్డుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూము లు కోల్పోయిన పలువురు అన్నదాతలకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. పుట్టపాక ప్ర ధాన రహదారి పక్కన ఎకరం రూ.కోటి ధర పలు కుతోందని, ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో సరిపెట్టుకుంటామని ముందుకు వచ్చినా చాలామందికి పరిహారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రతీ నిర్వాసితుడికి పూర్తిస్థాయి పరిహారం అందించాకే గ్రీన్‌ఫీల్డ్ పనులు చేసుకోవాలని రైతులు స్పష్టం చేశారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ వారితో మా ట్లా డి ఆందోళన విరమింపజేశారు. అనంతరం రైతులు ఆర్డీవోను కలువగా త్వరలో పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో అన్నదాతలు శాంతించి ఇంటిదారి పట్టారు.