
రగులుతున్న రగడ
● సింగరేణి లాభాల వాటాపై వివాదం● నిరసనలకు దిగుతున్న కార్మిక సంఘాలు ● ఆందోళనబాటలో రాజకీయ పార్టీలు
గోదావరిఖని: కార్మికుల లాభాల వాటా ప్రకటనపై సింగరేణి బొగ్గు గనుల్లో వివాదం రాజుకుంటోంది. సంస్థ సాధించిన వాస్తవ లాభాలు కాకుండా పెద్దమొత్తంలో పక్కనబెట్టి తక్కువ లాభాల్లోంచే వాటా ప్రకటించారని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రూ.2,289కోట్లు భవిష్యత్ అవసరాల కోసం కేటాయిస్తే.. ఈసారి రెట్టింపు పక్కన పెట్టడడంపై కార్మికులు, కార్మిక సంఘా లు, రాజకీయ పార్టీల్లోనూ దుమారం రేగుతోంది.
వాస్తవ లాభాలు రూ.6,394కోట్లు..
2024–25 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ లాభాలు రూ.6,394కోట్లు కాగా, భవిష్యత్ అవసరాల కో సం అందులోంచి రూ.4,034కోట్లు కేటాయించారు. మిగిలిన రూ.2,360కోట్లపై 34శాతం కార్మికులకు వాటా ప్రకటించడం వివాదానికి దారితీసింది. గతేడాదితో పోల్చితే రూ.1,692.7కోట్లు లాభాలు అధికంగా వచ్చినా, ఒకశాతం వాటా పెరిగినా కార్మికు లకు కేటాయించింది అదనంగా రూ.6.94కోట్లు మాత్రమే. దీంతో అందరూ పెదవి విరుస్తున్నారు.
ఆందోళనలకు దిగుతున్న అన్ని సంఘాలు..
సింగరేణిలోని ఏఐటీయూసీ, టీబీజీకేఎస్, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ తదితర కార్మిక సంఘాలతోపాటు బీఆర్‌ఎస్, బీజేపీ తదితర రాజకీయ పార్టీలు కూడా లాభాల వాటా ప్రకటన తీరును ఆక్షేపిస్తున్నాయి. ఈక్రమంలో గత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ మంగళవారం సింగరేణి వ్యాప్తంగా న ల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టింది. ప్రస్తుత గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ కూడా నిరసన వెల్లడించింది. దీనిని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొంది. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్‌టీయూసీ మాత్రం ఇంకా స్పందించడంలేదు.
కాంట్రాక్టు కార్మికుల వాటాపైనా అసంతృప్తి..
సింగరేణిలో సుమారు 30వేల మంది కాంట్రాక్టు కార్మికులకు కాంగ్రెస్ పా ర్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5వేల చొప్పు న లాభాల వాటా ప్రకటించింది. ఈసారి రూ.10 వేలు చెల్లించేలా ప్రకటన చేయాలని ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యాన్ని గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ కోరింది. అయితే గతేడాదికన్నా రూ.500పెంచి రూ.5,500 మాత్రమే చెల్లించను న్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంట్రాక్టు కార్మికుల ద్వారానే సంస్థకు లాభాలు వస్తున్నాయని పేర్కొంటున్న సంస్థ.. వారికి లాభాలు పెంచడంలో ఎందుకు అంగీకరించడం లేదని గుర్తింపు యూనియన్‌ఏఐటీయూసీ ప్రశ్నించింది.
ఇంత ఆర్భాటం అవసరమా..?
సింగరేణి కార్మికులకు ఏటా చెల్లిస్తున్న లాభాల వాటా విషయంలో యాజమాన్యం చేసిన ఆర్భాటాన్ని కార్మికులు, కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు, ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటించాల్సిన ఆనవాయితీ గతంలో ఉండేదని పేర్కొంటున్నాయి. లాభాల వాటా విషయంలో హంగు, ఆర్భాటాలు ఇప్పటికై నా మానుకోవాలని కోరుతున్నారు.
వాస్తవ లాభాలు(రూ.కోట్లలో) 6,394
భవిష్యత్ అవసరాలకు కేటాయింపు(రూ.కోట్లలో) 4,034
మిగిలిన లాభాలు(రూ.కోట్లలో) 2,360
అందులో కార్మికుల వాటా(శాతం) 34
కార్మికులకు చెల్లించే మొత్తం(రూ.కోట్లలో) 802.40
కాంట్రాక్టు కార్మికులకు చెల్లించేది(రూ.కోట్లలో) 17

రగులుతున్న రగడ