
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
పెద్దపల్లిరూరల్: వానాకాలం ధాన్యం కొనుగో ళ్లు సజావుగా సాగేలా కార్యాచరణ సిద్ధం చే యా లని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. ధా న్యం కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, డీఎస్‌వో శ్రీనాథ్, ఆర్టీవో రంగారావుతో కలిసి మంగళవారం సమీక్షించా రు. సన్నరకం ధాన్యం క్వింటాలుకు ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిందన్నారు. నాణ్యత ప్రమాణాలపై ఏఈవోలు అవగాహన పెంచుకుని, ఇబ్బందులు పరిష్కరించాలన్నారు. రైతు కు టోకెన్లు ఇచ్చి క్రమపద్ధతిలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చేలా చూడాలన్నారు. ప్ర భుత్వ, అటవీ భూముల్లో పంటలు పండించే రైతుల నుంచి ఏఈవోలు 50 క్వింటాళ్ల వరకు, అంతకు ఉంటే మండల వ్యవసాయాధికారిణి ధ్రువీకరించాలని ఆయన సూచించారు.
యూరియా లారీ అడ్డగింత
జూలపల్లి(పెద్దపల్లి): మండల కేంద్రానికి మంగళవారం ఉదయం వచ్చిన యూరియా లారీని కోనరావుపేట గ్రామ రైతులు ఆడ్డుకొన్నారు. ప దిరోజులుగా తమ గ్రామానికి యూరియా పంపించడం లేదని ఆరోపించారు. లారీని తమ ఊరికి తరలించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. రంగ ప్రవేశం చేసిన ఏవో ప్రత్యూష.. లారీని కోనరావుపేటకు తీసుకెళ్తుండగా తమకే యూరియా పంపిణీ చేయాలని జూలపల్లికి చెందిన రైతులు అడ్డుకున్నారు. దీంతో రెండు గ్రామాల రైతుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు కోనరావుపేటకు లారీ తరలించి యూరియా పంపిణీ చేశారు. రైతులు కూసుకుంట్ల రవీందర్‌రెడ్డి, కత్తెర్ల రాయమల్లు, వెంకటరెడ్డి, హన్మంతరెడ్డి, అంజయ్య, హనుమంతు పాల్గొన్నారు.
ఆయుర్వేద వైద్యంతో మేలు
పెద్దపల్లిరూరల్: దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్లనొ ప్పులు, వాతం లాంటి వ్యాధులను ఔషధ గుణాలున్న మొక్కలతో తయారు చేసిన పొడుల (ఆయుర్వేద మాత్రల)తో నయం చేయవచ్చని డీఎంహెచ్‌వో వాణిశ్రీ అన్నారు. ఉచిత మెగాఆ యుర్వేద వైద్యశిబిరాన్ని జిల్లా కేంద్రంలో మంగళవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఆ యుర్వేద వైద్యంతో దుష్ఫలితాలు ఉండవన్నా రు. కీళ్ల నొప్పులు, వాతం, కిడ్నిలో రాళ్లు, అర్ష మొలలు, బీపీ, ఎసిడిటి, మలబద్ధకం తదితర వ్యాధులకు ఇది బాగా పనిచేస్తుందని ఆయుష్ జిల్లా ఇన్‌చార్జి అరుణ తెలిపారు. వైద్యులు మ హేశ్, అమర్‌నాథ్, ప్రభాకర్, దివ్య, నిహారిక, శిరీష, మారుతి పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఆయుష్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ విద్యాసాగర్, కావేటి రాజగోపాల్ ఉన్నారు.

సజావుగా ధాన్యం కొనుగోళ్లు

సజావుగా ధాన్యం కొనుగోళ్లు

సజావుగా ధాన్యం కొనుగోళ్లు