
విద్యార్థులు క్రీడలపై దృష్టి సారించాలి
రామగిరి(మంథని): విద్యార్థులు క్రీడలపై దృష్టి సా రిస్తే సెల్‌ఫోన్ అడిక్షన్‌కు దూరమవుతారని మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ బులుసు విష్ణువర్ధన్ అన్నా రు. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, మై భారత్ పెద్దపల్లి జిల్లా, రామగిరి ఫ్రెండ్స్ యూత్ వేల్ఫర్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన బ్లాక్‌స్థా యి క్రీడాపోటీలను ఆయన ప్రారంభించారు. మానసిక ఒత్తిడి జయించాలన్నా, మానసిక ఉల్లాసం కలగాలన్నా క్రీడలు ముఖ్యమన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్‌కుమార్, మై భారత్ జిల్లా ఇన్‌చార్జి మహేశ్, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.