
సైబర్‌నేరాలపై అవగాహన
గోదావరిఖని: సైబర్‌నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. తన కార్యాలయంలో సోమవారం సీపీ సైబర్ వారి యర్స్‌తో నేరాలపై సమీక్షించారు. సైబర్‌నేరాల్లో అత్యధికంగా సొత్తు రికవరీ చేసిన వారియర్స్‌కు ప్రసంశాపత్రాలు, టీషర్ట్‌లు అందజేశారు. దుర్గామాత మండపాలు, బతుకమ్మల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా విజబుల్ పోలీసింగ్ నిర్వహించాలని ఆదేశించారు. మహిళలపై వేధింపు లు, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగ సెలవుల్లో ఊళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైన స్థానిక పోలీస్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్‌క్రైం సీఐలు శ్రీనివాస్, కృష్ణమూర్తి, సీసీ హరీశ్ పాల్గొన్నారు.