
నేడు ఉచిత వైద్యశిబిరం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో మంగళవా రం ఆయుర్వేద ఉచిత వైద్యశిబిరం నిర్వహి స్తారు. వైద్యశిబిరం ప్రచార పోస్టర్‌ను కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఆయుష్ అధికారి అరుణ, డాక్ట ర్ మారుతి, డీపీఎం విద్యాసాగర్‌తో కలిసి సో మవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. స్థానిక ఎంబీ గార్డెన్‌లో నిర్వహించే మెగా వైద్యశిబిరంలో వాతరోగాలు, కీళ్ల నొప్పులు, అర్షమొలలు, హైబీపీ, అల్సర్, మలబద్ధకం, కిడ్నీలో రాళ్లు, జ్వరం, దగ్గు, జలుబు, ఆస్తమా, జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేస్తారు.
పరిశ్రమల అభివృద్ధి లక్ష్యం
రామగుండం: పరిశ్రమల అభివృద్ధి, పర్యావ రణ పరిరక్షణ, ప్రజల భద్రత, హక్కులను కా పాడడడం ప్రధానమని ఎంపీ వంశీకృష్ణ అన్నా రు. మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆ యన వివిధ అంశాలపై చర్చించారు. ఎన్టీపీసీ, ఇంధన డిపోలు, బొగ్గు గనులు తదితర పరిశ్రమల స్థాపనతో సమీప గ్రామాల్లో వాతావరణం కాలుష్యం కాకుండా పరిశ్రమల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని సూచించారు.
సీఎంను కలిసి ఠాకూర్
గోదావరిఖని: సింగరేణి లాభాల వాటా ప్రకటించిన సీఎం రేవత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సోమవారం హైదరాబాద్‌లో కలిసి పుష్పగు చ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పండుగకు ముందే లాభాల వాటా ప్రకటించడంతో కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారు.
ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల సర్వే
పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వ బాలికల జూ నియర్ కాలేజీ విద్యార్థినులు సోమవారం గౌ రె డ్టిపేటలో ఇంటింటి సర్వే చేశారు. బడిబయటి బడీడు పిల్లలుపై ఆరా తీశారు. ప్రోగ్రాం అధి కారి నరహరి, పంచాయతీ కార్యదర్శి తిరుపతి, అధ్యాపకులు ప్రసూన, శ్రీలత, పుష్పలత, అ శోక్, కుమారస్వామి ఉన్నారు. ప్రభుత్వ బాలు ర జూనియర్ కాలేజీ వలంటీర్లు హన్మంతునిపేటలో సర్వే చేశారు. ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ సదయ్య, అధ్యాపకులు శ్రీని వాస్, రాజేంద్రప్రసాద్, నర్సింహరాజు, వి.మమత, దివ్య తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీలకు ఆర్థిక భరోసా
పెద్దపల్లిరూరల్: పేద మైనార్టీ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంతన్న కా సహా రా పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందని జిల్లా ఇన్‌చార్జి అధికారి రంగారెడ్డి తెలిపారు. దూదెకుల, ఫకీర కుటుంబాలు అర్హులని, అక్టోబరు 6లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
క్రిస్టియన్లకు ఉచిత శిక్షణ
నిరుద్యోగ క్రిస్టియన్లకు ప్లంబర్ కోర్సులో ఉచి త శిక్షణ ఇవ్వనున్నట్టు ఇన్‌చార్జి అధికారి రంగా రెడ్డి తెలిపారు. న్యానాక్ ఆధ్వర్యంలో మూడు నెలలు శిక్షణ ఉంటుందని, ఆసక్తి గలవారు ఈనెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరా రు. వివరాలకు 99633 13318, 90002 94176 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ప్లాట్ల విచారణ వాయిదా
రామగిరి(మంథని): నాగెపల్లిలో ఓపెన్ ప్లాట్లపై సోమవారం జరపాల్సిన విచారణ వాయిదా ప డింది. ఓపెన్ ప్లాట్లలో అవకతవకలు జరిగా యని గ్రామస్తులు తీగల సమ్మయ్య, కొండవేన ఓదెలు ఫిర్యాదు చేయగా.. డీపీవో వీరబుచ్చయ్య.. విచారణకు కమిటీని నియమించారు. అయితే, అనివార్య కారణాలతో విచారణ వాయిదా పడడంతో మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తారు. మరోవైపు.. వినతిపత్రి ఇంచ్చేందుకు వెళ్లిన తమను గ్రామపంచాయతీ కార్యదర్శి అవమానించారని, ఆయనపై చర్య తీసుకోవాలని వీహెచ్‌పీఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఎంపీడీవోను కోరారు. ఈ విషయంపై సెక్రటరీని సంప్రదించగా.. అదంతా అవాస్తవమన్నారు.

నేడు ఉచిత వైద్యశిబిరం

నేడు ఉచిత వైద్యశిబిరం

నేడు ఉచిత వైద్యశిబిరం