
లాభాల వాటా నామమాత్రమే!
భవిష్యత్‌నిధి కోసం భారీగా మళ్లింపు కారణం
సింగరేణి కార్మికుల వాటా రూ.802.40 కోట్లు
కాంట్రాక్టు కార్మికులకు రూ.17 కోట్లు కేటాయింపు
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు
గోదావరిఖని: లాభాల వాటాపై సింగరేణి కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. లాభాలు అధి కంగా ఆర్జించినా భవిష్యత్ అవసరాల కోసం భా రీగా కేటాయించడం ఇందుకు కారణమంటున్నా యి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన వాస్తవ లాభాలను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం హై దరాబాద్‌లో ప్రకటించారు. రూ.6,394.0కోట్లు లా భాలు రాగా అందులో కార్మికుల వాటా 34 శాతం.. రూ.802.40కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించారు. కాంట్రాక్టు కార్మికులకూ మరో రూ.17 కోట్లు కేటాయించి, ఒక్కో కార్మికుడికి రూ.5,500 చొప్పున పంపిణీ చేస్తారు.
భవిష్యత్ అవసరాల కోసమని..
భవిష్యత్ నిధి కోసం గతేడాది లాభాల్లోంచి రూ. 2,289 కోట్లు పక్కన పెట్టగా, ఈసారి రెండింతలు.. రూ.4,034కోట్లు పక్కన పెట్టడంతో కార్మికులకు వాటా చేతికి పెద్దగా అందదంటున్నారు. గ తే డాదికన్నా ఒకశాతం వాటా పెరిగినా.. డబ్బు ల విషయానికస్తే పెంపు పెద్దగా లేదంటున్నారు. గతంలో 33 శాతం వాటాగా రూ.796 కోట్లు కే టాయించగా.. ఈసారి 34 శాతం వాటాతో రూ. 02.40 కోట్లు వస్తే.. అందులో పెరిగింది కేవలం రూ.6.34 కోట్లు మాత్రమే అంటూ కార్మికులు నిరాశ చెందుతున్నారు. సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా 72 మిలియన్ టన్నులు కాగా 69.01 మిలియన్ టన్నుల సాధించింది.