
మల్లన్న సేవలో అడిషనల్ కలెక్టర్
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామిని ఆదివారం అడిషనల్ కలెక్టర్ వేణు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీతరామచంద్రస్వామి, నందీశ్వరులను దర్శనం చేసుకున్నారు.
సింగరేణి స్టేడియంలో రామ్‌లీలా
గోదావరిఖని(రామగుండం): లామ్‌లీలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆదివారం సినీ నటుడు శివారెడ్డి స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించారు. దసరా సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సూచనల మేరకు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ మాట్లాడుతూ, రామ్‌లీలా సంబరాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. సింగరేణి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏసీపీ మడత రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి, డీజీఎం సివిల్ వరప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, లింగస్వామి, ముస్తాఫా, గట్ల రమేశ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్టుకు నాగచైతన్య
ఎలిగేడు(పెద్దపల్లి): మండలంలోని ధూళికట్ట జెడ్పీ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి జెల్లి నాగచైతన్య అండర్– 14 విభాగంలో ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్టుకు ఎంపికై నట్లు హెచ్‌ఎం స దయ్య, పీడీ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 19, 20 తేదీల్లో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభచా టాడు. అలాగే 8వ తరగతి విద్యార్థి సిద్ధార్థ ఉ మ్మడి జిల్లా కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు పే ర్కొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులను ఉ పాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
జిల్లాస్థాయి ఖోఖో పోటీలు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం అప్పన్నపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లాస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించారు. ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్స్, జూనియర్స్ విభాగాల పోటీలను జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య, కార్యదర్శి కుమారస్వామి, నరేశ్, సురేందర్ ప్రారంభించారు. ప్రతిభచాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. హెచ్‌ఎం పురుషోత్తం, నారాయణ, తిరుపతిరెడ్డి, షఫీయొద్దీన్, ప్రసాద్, భాస్కర్, భూపతి తదితరులున్నారు.
‘ఖని’ నుంచి బీదర్‌కు ఆర్టీసీ ప్రత్యేక బస్సు
గోదావరిఖనిటౌన్(రామగుండం): గోదావరిఖని నుంచి కర్ణాటకలోని బీదర్‌కు ఈ నెల 23న ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడుపనున్నట్టు డిపో మేనేజర్ ఎం.నాగభూషణం తెలిపారు. 23న రాత్రి 9 గంటలకు బస్సు గోదావరిఖని బస్టాండ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం బీదర్‌కు చేరుకుంటుందని తెలిపారు. బీదర్‌లోని శ్రీ క్షేత్రఝురాణి నరసింహస్వామి దర్శనం అనంతరం రేజింతల్‌లోని వరసిద్ధి వినాయకుడు, శ్రీకేతకీ సంగమేశ్వరస్వామి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం 24న రాత్రి గోదావరిఖనికి తిరుగు ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. పెద్దలకు రూ.1,600, పిల్లలకు రూ.1,250 చార్జీలు నిర్ణయించడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలకు 70135 04982, 73828 47596 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

మల్లన్న సేవలో అడిషనల్ కలెక్టర్

మల్లన్న సేవలో అడిషనల్ కలెక్టర్