
తల్‌సైనిక్ క్యాంపును పూర్తి చేసిన పాల్సన్ రాజ్
గోదావరిఖనిటౌన్(రామగుండం): స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో బీకాం సెకండియర్ చదువుతున్న ఎన్‌సీసీ విద్యార్థి పాల్స న్ రాజ్ ఎన్‌సీసీ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన తల్‌సైనిక్ క్యాంపు విజయవంతంగా పూర్తి చేశాడు. కరీంనగర్ 9వ బెటాలియన్‌లో ఉన్న పాల్సన్ నిజామాబాద్ గ్రూపు స్థాయిలో ఎంపికై న ఏకై క విద్యార్థి. ఈ క్యాంపులో భాగంగా న్యూఢిల్లీలోని డీజీఎన్‌సీసీ ఆధ్వర్యంలో 12రోజులు ఫైరింగ్ విభాగంలో క్యాంపు విజయవంతంగా పూర్తి చేసి కళాశాలకు వచ్చిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జైకిషన్ ఓజ, వైస్ ప్రిన్సిపాల్ సాంబశివరావు, ఎన్‌సీసీ అధికారి బి.తిరుపతి, అధ్యాపకులు అభినందించారు.