
రాజన్న సేవలో జైళ్ల శాఖ డీజీ
వేములవాడ: రాజన్నను రాష్ట్ర జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా శనివారం దర్శించుకున్నారు. ఆలయా నికి చేరుకున్న ఆమెకు అర్చకులు, వేదపండితులు స్వా గతం పలికారు. శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. జైళ్లశాఖ డీఐజీ సంపత్, ఎస్పీ మహేశ్ బీ గీతే, వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి ఉన్నారు.
ఇనుప సామగ్రి తీసుకెళ్తున్న ఉద్యోగి పట్టివేత
జ్యోతినగర్(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు నుంచి అనుమతి లేకుండా సామాను తీసుకెళ్తున్న ఉద్యోగిని సీఐఎస్‌ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డబ్ల్యూ–02 ఉద్యోగి యూనిట్–7లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం స్క్రాప్‌ను తన బైక్‌లో పెట్టుకుని బయటకు తరలిస్తుండగా గేట్ నంబర్–1 వద్ద సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ తర్వాత నిందితుడితోపాటు స్క్రాప్‌ను పోలీసులకు అప్పగించారు. స్క్రాప్ బరువు 27 కేజీలు ఉంటుందని సమాచారం.