విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

Sep 21 2025 5:59 AM | Updated on Sep 21 2025 5:59 AM

విద్య

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

మహారాష్ట్రలో జిల్లెల్లవాసి.. రైల్వేట్రాక్‌ పక్కన మృతదేహం బతుకుదెరువు బాటలో ఆగిన గుండె

మేడిపల్లి: కోతుల బెడ ద నుంచి మొక్కజొన్న పంటను కాపడుకునేందుకు అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి చెందిన ఘటన భీమారం మండలం పసునూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాలోతు సత్యనాయక్‌ కోతుల నుంచి పంటను కాపాడుకునేందుకు విద్యుత్‌ వైర్‌ అమర్చాడు. శనివారం ఉదయం ఎప్పటిలాగే చేనుకు వెళ్లిన సత్యనాయక్‌.. వైర్లకు తగిలి అక్కడిక్కకడే మృతి చెందాడు. సత్యనాయక్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య భూమిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్సె శ్రీధర్‌ రెడ్డి తెలిపారు.

తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన పరకాల శ్రీనివాస్‌(45) బతుకుదెరువు కోసం మహారా ష్ట్రకు వలసవెళ్లాడు. అక్కడే ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. నిరుపేద కుటుంబం కావడంతో చందాలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు.

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని రైల్వే వంతెన కింద ట్రాక్‌ పక్కన ఓ మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి తిరుపతి శనివారం తెలిపారు. స్థానిక సుభాష్‌నగర్‌కు చెందిన తాళ్లపల్లి సమ్మయ్య(52) రైళ్లలో భిక్షాటన చేస్తున్నాడు. బుధవారం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అయితే, రైల్వేట్రాక్‌ పక్కన ముళ్లపొదల్లో లభ్యమైన మృతదేహాన్ని పరిశీలించగా.. అది సమ్మయ్యదిగా నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య దేవమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసుకొన్నారు.

గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరింటాలకు చెందిన సంగం ప్రశాంత్‌(28) కూలీ పనులు చేస్తూ బతుకుతున్నాడు. బతుకుదెరువు కోసం గల్ఫ్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం జగిత్యాలలో ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. తిరిగి వస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. 108 వాహనంలో కరీంనగర్‌ తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్‌ తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ సాయం కింద రూ.25వేలు అందించారు.

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి1
1/2

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి2
2/2

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement