
అడవుల్లో చెట్లు నరికితే కేసులు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: అడవుల్లోని చెట్లను నరికిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలె క్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివా రం అడిషనల్ కలెక్టర్ వేణు, డీసీపీ కరుణాకర్‌తో క లిసి అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొ న్నారు. జిల్లా అటవీ అధికారి శివయ్య.. అడవుల స్థి తిగతులపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. జిల్లాలో అటవీ సంపదను కాపాడేందుకు రెవెన్యూ, పోలీసు, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. అటవీ భూములు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షించాలని పే ర్కొన్నారు. ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, ఏసీపీలు కృష్ణ, రమేశ్, ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు.