కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకం

Sep 21 2025 5:39 AM | Updated on Sep 21 2025 5:39 AM

కోర్ట

కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకం

గోదావరిఖని: దోషులకు శిక్ష పడడంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమని రామగుండం పో లీస్‌ కమీషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. కమిషనరేట్‌ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్‌ అధికారులతో సీపీ వివిధ అంశాల పై శనివారం సమీక్షించారు. నేరస్తులకు శిక్ష ప డితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇందుకోసం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాలని తెలిపారు. ఈ సందర్భంగా ఓ కేసులో మూగయువతి సైగలను అనువాదం చేసి కోర్టులో దో షికి 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కృషి చేసి శ్రీరాంపూర్‌కు చెందిన యోసేపును సీపీ సన్మానించా రు. గోదావరిఖని, ఏఆర్‌ ఏసీపీలు రమేశ్‌, ప్ర తాప్‌, లీగల్‌ సెల్‌, ఐటీసెల్‌ సీఐలు కృష్ణ, చంద్రశేఖర్‌గౌడ్‌, సీసీఆర్‌బీ ఎస్సై చంద్రకుమార్‌, సీసీ హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సనాతన ధర్మం విస్మరించవద్దు

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): సనాతన ధర్మం స ర్వమానవాళి సంక్షేమం, శ్రేయస్సు కోరుతుందని, అందుకే దానిని విస్మరించవద్దని స్థానిక జ్ఞా నమౌనీశ్వర ఆశ్రమ పీఠాధిపతి బసవత్తుల రా జమౌళి ఆచార్యులు అన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌, హరిత సేన ఆధ్వర్యంలో ఆశ్రమం, వేదపాఠశాలలో శనివారం శమీ మొక్కలు నా టారు. ఈసందర్భంగా పీఠాధిపతి ప్రవచించారు. సనాతన ధర్మంలో ఆరోగ్య ప్రయోజనాలు కూడి ఉన్నాయని అన్నారు. హరిత సేన రాష్ట్ర కో ఆర్డినేటర్‌ చెప్యాల రాజేశ్వర్‌రావు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్‌యాదవ్‌, మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, నాయకులు జూకంటి శిరీష, ఆడెపు రాజు, అనిల్‌, కరుణాకర్‌రావు, రంజిత్‌రెడ్డి, శ్రీకాంత్‌రావు, విద్యార్థులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ కార్యాలయం ముట్టడి

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): గత ఎన్నికల్లో ఇ చ్చిన హామీ మేరకు పింఛన్‌ పెంచాలనే డిమాండ్‌తో ఎమ్మర్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్‌ నేతృత్వంలో వృద్ధులు, దివ్యాంగు లు, ఒంటరి మహిళలు గంగారం గ్రామ పంచా యతీ కార్యాలయాన్ని శనివారం ముట్టడించా రు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజేందర్‌ మాట్లాడుతూ, మాట నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం రూ.6వేల వరకు పింఛన్‌ పెంచాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బైరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

బీఎంఎస్‌తోనే ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ

జ్యోతినగర్‌(రామగుండం): ఉద్యోగుల మెరుగై న వేతన సవరణ బీఎంఎస్‌ అనుబంధ ఎన్టీపీ సీ కార్మిక సంఘ్‌తోనే సాధ్యమని ఎన్టీపీసీ ఎన్బీ సీ సభ్యుడు, బీఎంఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు సుంకరి మల్లేశం, అదనపు సభ్యుడు ఆర్‌ఎన్‌ గ ణేశ్‌ అన్నారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు మెయిన్‌ గేట్‌ వ ద్ద శనివారం జరిగిన సమావేశంలో వారు మా ట్లాడారు. నిర్వాసిత కోటాలో ఉద్యోగం పొంది న వారికి పీఆర్‌ఎంఎస్‌ సౌకర్యం కల్పించాలని, కేరీర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ప్రత్యేక శిక్షణ ఇ చ్చి పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ ఉద్యోగుల హ క్కుల సాధనలో విఫలమైందని విమర్శించా రు. 2027లో జరిగే వేతన సవరణలో ప్రత్యేక భాగస్వామిగా నిలిపేందుకు ఈనెల 25న జరి గే ఎన్టీపీసీ ఉద్యోగ గుర్తింపు ఎన్నికల్లో గులాబీ పువ్వు గుర్తుపై ఓటు వేసి బీఎంఎస్‌ను గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయ కులు కేతిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సాగర్‌ రాజు, బండారి కనకయ్య, పోగుల స్వామి, చల్లా సత్యనా రాయణరెడ్డి, యాదగిరి సత్తయ్య, రంజిత్‌, మహేశ్‌, ఉద్యోగులు తదతరులు పాల్గొన్నారు.

కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకం 1
1/2

కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకం

కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకం 2
2/2

కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement