
పేదలకు కాంగ్రెస్ సర్కార్ అండ
పెద్దపల్లిరూరల్: పేదల కళ్లలో ఆనందం చూడాలన్న దే సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కా రు లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నా రు. నియోజకవర్గ పరిధిలోని 133మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా మంజూ రైన రూ.1,33,15,428 విలువైన చెక్కులను శనివా రం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సీ ఎం సహాయనిధి నుంచి 820 మందికి మంజూరైన రూ.2,64,06,900 విలువైన చెక్కులు అందజేసి మాట్లాడారు. ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా ప్రధాన ఆస్పపత్రిని అన్నివిధాలా ఆధునికీకరిస్తున్నామని తెలిపారు. త హసీల్దార్ రాజయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్లు స్వరూప, ప్రకాశ్‌రావు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
సుల్తానాబాద్(పెద్దపల్లి): దేశభవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 29మందిని మండల కేంద్రంలో ఆయన సన్మానించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఎంఈవో రాజ య్య, ప్రతినిధులు దామోదర్ రావు,సాయిరి మ హేందర్, శ్రీగిరి శ్రీనివాస్, పన్నాల రాములు, కిశో ర్, నాయకులు సతీశ్, అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు.
నక్కల ఒర్రైపె వంతెన నిర్మించాలి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మల్యాల – పోచంపల్లి మధ్య నక్కలఒర్రైపె వంతెన నిర్మించాలనే డిమాండ్‌తో రెండు గ్రామాల రైతులు శనివారం నిరసన తె లిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఒర్రె వరద ఉ ధృతికి మహిళా కూలీలు, రైతులు కొట్టుకు పోయా రని, స్థానికుల అప్రమత్తతతో వారు ప్రాణాలతో బ యట పడ్డారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ నాయకులు నూనేటి సంపత్ యాదవ్, వవంగళ తిరుపతిరెడ్డి, పుప్పాల నాగార్జున్‌రెడ్డి రైతులు పాల్గొన్నారు.

పేదలకు కాంగ్రెస్ సర్కార్ అండ