
ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
● బల్దియా కమిషనర్ అరుణశ్రీ ఆదేశాలు ● బతుకమ్మ, దసరా ఉత్సవాలపై సమీక్ష
కోల్‌సిటీ(రామగుండం): నగర ప్రజలకు ఇబ్బందు లు తలెత్తకుండా బతుకమ్మ, విజయదశమి పండు గలకు ఏర్పాట్లు చేయాలని రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ ఆదేశించారు. బల్దియా కార్యాలయంలో పండుగల ఏర్పాట్లపై కమిషనర్ సమీక్షించారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో శుభ్రం చేయించాలని, మరుసటి రోజు ఉదయమే ఆకులు, పూలను కంపోస్ట్‌యార్డ్‌కు తరలించాలని సూచించారు. వా ర్డు అధికారుల సమాచారం ఆధారంగా రోడ్లపై గుంతలు పూడ్చాలని, లైటింగ్స్ ఏర్పాటు చేయాలన్నా రు. గోదావరి వంతెన వద్ద బతుకమ్మల నిమజ్జనం సాఫీగా సాగడానికి లైటింగ్, ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పా టు చేయాలన్నారు. ఆయా విభాగాల అధికారుల తో సమన్వయంతో సింగరేణి స్టేడియంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించా రు. బల్దియా అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసా ద్, ఎస్‌ఈ గురువీర, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఉమామహేశ్వర్‌రావు పాల్గొన్నారు. కాగా, వరల్డ్ క్లీన్ అప్ డే –2025 సందర్భంగా పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి జిల్లా నేషనల్ గ్రీన్ కార్‌ప్స్ రూపొందించిన పోస్టర్‌ను కమిషనర్ అరుణశ్రీ ఆవిష్కరించారు. నేషనల్ గ్రీన్ కార్ప్స్ బ్రాండ్ అంబాసిడర్ అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.