
లాభాల వాటా ప్రకటించాలి
గోదావరిఖని: సింగరేణి సాధించిన వాస్తవ లాభా లు ప్రకటించాలని, అందులో కార్మికులకు 35శాతం వాటా చెల్లించాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరా వు, అధ్యక్షుడు సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ కోరారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డిని శనివారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్మికులకు సొంతింటి ప థకం అమలు చేయాలని, మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, అర్జీ పెట్టుకున్నవారందరినీ ఆన్‌ఫిట్ చే సి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మారుపేర్ల సమస్యపై అడ్వకేట్ జనరల్ న్యాయ సలహా త్వరగా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కొత్త బొగ్గు గనుల సాధనకు రాష్ట్రప్రభుత్వం సింగరేణికి ఆదేశాలిచ్చి, కోయగూడెం–3, సత్తుపల్లి–3, తాడిచర్ల–2 బ్లాకులు సాధించేలా చూడాలని కోరారు.