
యువతకు ఉపాధి అవకాశాలు
పెద్దపల్లిరూరల్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. స్థానిక టాస్క్ సెంటర్‌లో శుక్రవారం టెలిఫెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ నిర్వహించిన జాబ్‌మేళాను కలెక్టర్ సందర్శించి నిర్వాహకులకు సూచనలు చేశారు. మేళాకు 117మంది అభ్యర్థులు హాజరుకాగా 27 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని కలెక్టర్ తెలిపారు. ఎంప్లాయిమెంట్ ఇన్‌చార్జి అధికారి తిరు పతిరావు, టాస్క్ ఇన్‌చార్జి కౌసల్య పాల్గొన్నారు.
‘పోక్సో’పై అవగాహన..
చిన్నారులపై లైంగిక దాడుల నియంత్రణ, నిందితులకు కఠిన శిక్షలు పడేలా పోక్సో యాక్టు అమల్లోకి తెచ్చారని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. పోక్సో యాక్టుపై కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. బాధితులకు మనోధైర్యం కల్పించాలని సూచించారు. డీసీపీ కరుణాకర్, డీడబ్ల్యూవో వేణుగోపాల్, ఏసీపీ కృష్ణ తదితరులు ఉన్నారు.
ఇంటర్ విద్యార్థులకు అపార్ కార్డులు..
ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు అపార్ కార్డు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఇంటర్ విద్యపై సమీక్షించిన ఆయన.. ప్రతీ శనివారం యూడీసీఐ వివరాలు అప్‌డేట్ చేయాలన్నారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన, అశోక్‌కుమార్, పీఆర్‌ఈఈ గిరీశ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం
గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలతో ఆరోగ్యానికి కలిగే హాని గురించి వివరించడంతోపాటు.. నిషేధిత మత్తు పదార్ధాలను విక్రయించినా, కొనుగోలు చేసినా చర్యలు ఉంటాయని ఊరూరా ప్రచారం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రచార వాహనాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. యువత మత్తుకు బానిసై భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దని కలెక్టర్ సూచించారు. ఇంటర్ విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా అధ్యాపకులు ప్రత్యేక దృష్టిని సారించాలని ఆయన అన్నారు.
సర్కారు బడుల్లో డిజిటల్ బోధన
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు డిజిటల్ విద్యా బోధన చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. టెన్త్‌లో మంచి ఫలితాలు సాధించేలా స్టడీ అవర్స్ ప్రారంభించాలని అయన అన్నారు. ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా విద్యార్థులు, ఉపా ధ్యాయుల హాజరు నమోదు చేయాలన్నారు. ది వ్యాంగులకు సదరం సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు లు జాప్యంలేకుండా జారీచేయాలన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, డీఈవో మాధవి, డీఆర్డీవో కాళిందిని, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, విజయ్, జీఈసీవో కవిత, జీజీహెచ్ ఆర్‌ఎంవో రాజు, ఈడీఎం కవిత, ఎంపీఎం రమాదేవి తదితరులు ఉన్నారు.