
గతంలో కన్నా ఘనంగా దసరా ఉత్సవాలు
ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
కోల్‌సిటీ(రామగుండం): నగరంలో ఈసారి గతంలో కన్నా దసరా ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కోరారు. బల్దియా కార్యాలయంలో శుక్రవారం కమిషనర్ అ రుణశ్రీతో కలిసి దసరా ఉత్సవాల సన్నాహక సమా వేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, దు ర్గమ్మ విగ్రహాలను రోడ్లపై ఏర్పాటు చేయొద్దన్నా రు. అంబులెన్స్ వెళ్లడానికి దారి ఉంచాలని అన్నా రు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్టీపీసీ ఈసారి కూడా నిధులు మంజూరు చేయాలని, ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉత్సవాల నిర్వహణలో పాలు పంచుకోవాలని కోరారు. త్వరలో జరిగే సమ్మక్క– సారలమ్మ జాత రకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఏసీపీ రమేశ్, సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్ కుమా ర్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, సివిల్ డీజీఎం వరప్రసాద్, ఆర్‌ఎఫ్‌సీఎల్ మేనేజర్ శుక్లా, వంశీకృష్ణ, ఎన్‌పీడీసీఎల్ డీఈ ప్రభాకర్, ఏడీఈలు వెంకటేశ్వర్లు, రమేశ్, జిల్లా మత్స్యశాఖాధికారి నరేశ్ కుమా ర్, బల్దియా అడిషనల్ కమిషనర్ మారుతిప్రసాద్, ఎస్‌ఈ గురువీర, ఏఈ రామన్ పాల్గొన్నారు.