
ముగిసిన ఎస్జీఎఫ్ ఆటల పోటీలు
● ప్రథమస్థానంలో నిలిచిన సుల్తానాబాద్ డివిజన్ జట్టు
సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ జూనియ ర్ కాలేజీలో చేపట్టిన 69వ ఎస్జీఎఫ్ అండర్ –14, 17 బాలబాలికల ఆటల పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ముఖ్య అ తిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశనుంచే ప ట్టుదలతో చదివి విజయం సాధించాలన్నారు. ఇంటికి వచ్చాక తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఏసీపీ కృష్ణ, డీవైఎస్‌వో సురేశ్ మాట్లాడారు. సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంథని జోన్ల నుంచి 350 మంది క్రీడాకారులు హాజరయ్యారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి రంగారెడ్డి, సీఐలు సుబ్బారెడ్డి, ప్రదీప్‌కుమార్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, మున్సిపల్ కమిషనర్ రమేశ్, ఎంఈవో రాజయ్య, ప్రతినిధులు పన్నాల రాములు, పడాల అజయ్‌గౌడ్, సాయిరి మహేందర్, ముస్త్యాల రవీందర్, అమిరిశేట్టి తిరుపతి, చిలుక సతీశ్, అబ్బయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.