
కవిత శ్రీరాంపూర్ పర్యటనకు ఏర్పాట్లు
● హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్‌అహ్మద్
గోదావరిఖని: తమ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈనెల 23న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో జరిగే బతుకమ్మ వేడుకలకు హాజరవుతారని హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్‌అహ్మద్ తెలిపారు. ఇందుకోసం పెదఎత్తున ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక బీగెస్ట్‌హౌస్ నుంచి శ్రీరాంపూర్ వరకు బైక్‌ర్యాలీ నిర్వహిస్తామన్నారు. కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ విఫలమయ్యాయని విమర్శించారు. సొంతింటి పేరిట సీఐటీయూ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. తాము పదవుల కోసం కాదని, కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తామని అన్నా రు. పండుగ బోనస్‌పై ఈనెల 22న ఢిల్లీలో జేబీసీసీఐ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నాయకులు దావు రమేశ్, రాంచందర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.