
కాంగ్రెస్ హయాంలో కార్మికులకు అన్యాయం
గోదావరిఖని: కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు అన్నింటా అన్యా యం జరుగుతోందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షు డు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి యూనియన్ శ్రేణులతో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను శు క్రవారం ముట్టడించారు. సీఎండీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం కొప్పుల మాట్లాడారు. గ తేడాది లాభాల్లో 33శాతం కార్మికులకు ఇవ్వకుండా కేవలం 16శాతమే ఇచ్చి అభివృద్ధి పేరిట రూ. 2,289 కోట్లు పక్కన పెట్టారని ఆరోపించారు. ఇప్పటివరకు వాటి వివరాలు తెలియజేయలేదన్నారు. ఈఏడాది అధిక లాభాలు వచ్చాయని, వాస్తవ లా భాలను ప్రకటించి కార్మికులకు 35శాతం వాటా చె ల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు కాపు కృష్ణ, కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, పర్లపల్లి రవి, కుసన వీరభద్రం, మంగీలాల్, అన్వేష్, బండి రమే శ్, నాగెల్లి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.