
ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోయించాలి
మంథని: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు 22 నెలలు గడుస్తున్నా నియోజకవర్గంలో 22 ఇంది రమ్మ ఇళ్లను కూడా కట్టించి ఇవ్వలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని రాజగృహలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్ర తీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తే ఇక్కడ 1,400పైచిలుకు మాత్రమే మంజూరు చేశా రని ఆయన దుయ్యబట్టారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు పూర్తిచేశారో, ఎన్ని గృహ ప్రవేశాలు చేశారో సమాధానం చెప్పకుడా ప్రతీ రోజు తమపై ఎలా దాడులు చేయాలే.. పుట్ట మధు ను ఎలా అంతం చేయాలనే ఆలోచన తప్ప చిత్తశుద్దితో పనిచేసిన దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. ఈదసరా పండుగ వరకు ఇళ్లకు ముగ్గు పో యించాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, తరగం శంకర్‌లాల్, కనవేన శ్రీనివాస్, మాచిడి రాజూగౌడ్, ఆరెపల్లి కుమార్, మంథని లక్ష్మణ్, ఆకుల రాజబాపు పాల్గొన్నారు.