స్వదేశీ సాంకేతికత భేష్‌ | - | Sakshi
Sakshi News home page

స్వదేశీ సాంకేతికత భేష్‌

Sep 20 2025 6:40 AM | Updated on Sep 20 2025 6:40 AM

స్వదే

స్వదేశీ సాంకేతికత భేష్‌

రామగుండం: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, ఆ విష్కరణలు జాతీయ ప్రగతికి సోపానాలని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. చంఢీగఢ్‌లో జరు గుతున్న సెంట్రల్‌ సైంటిఫిక్‌ ఇన్‌స్టుమెంట్స్‌ ఆర్గనైజేషన్‌(సీఎస్‌ఐఆర్‌) ఆవిష్కరణలను ఆ యన పలువురు ప్రతినిధులతో కలిసి శుక్రవా రం సందర్శించారు. శాసీ్త్రయ పరిశోధనలతో అభివృద్ధి చేసిన స్వదేశీ పరిజ్ఞానం దేశప్రగతి, గ్రామీణ పరిశ్రమల ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు. ఇందులో సుమారు 200పైగా ఆవిష్కరణలు ప్రదర్శించారని తెలిపారు.

టీ హబ్‌తో పేదలకు మేలు

పెద్దపల్లిరూరల్‌: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్ప త్రిలోని టీ హబ్‌ ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఆధునిక యంత్రాలతో నిర్వహించి పే షెంట్‌ మొబైల్‌ నంబర్లకు ఫలితాలు చేరవేస్తు న్నామని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ అన్నారు. శుక్రవారం టీ హబ్‌ కేంద్రాన్ని సందర్శించా రు. ల్యాబొరేటరీ పనితీరు గురించి నిపుణుడు శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈనెల లో ఇప్పటిరకు 7,444 మంది పేషెంట్ల నుంచి 24,414 బ్లడ్‌శాంపిళ్లు సేకరించామని తెలిపా రు. జిల్లాలోని 18 పీహెచ్‌సీలు, 07 యూపీహెచ్‌సీలతోపాటు మంథని, సుల్తానాబాద్‌ క మ్యూనిటీ ఆరోగ్యకేంద్రాలు, పెద్దపల్లి రామ గుండం ఆస్పత్రుల నుంచి సేకరించిన రక్తనమూనాలు పరీక్షిస్తున్నామని అన్నారు.

బల్దియా ఎస్‌ఈగా గురువీర

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ పబ్లిక్‌ హెల్త్‌ విభాగం(పీహెచ్‌) సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌(ఎస్‌ఈ) గా జి.గురువీర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లో ఎస్‌ఈగా విధులు నిర్వహించిన గురువీరను.. ప్రభుత్వం ఇక్కడకు బదిలీ చేసింది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఈఈ )గా ఆర్‌.శివానంద్‌, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌(ఎస్‌ఈ)గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. అయితే ప్రభుత్వం కొత్త ఎస్‌ఈకి పోస్టింగ్‌ ఇవ్వడంతో, శివానంద్‌ను ఎస్‌ఈ బాధ్యతల నుంచి తప్పించింది.

లాభాల వాటా చెల్లించాలి

గోదావరిఖని: గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన లాభాలు ప్రకటించి, 35 శా తం కార్మికులకు వాటా చెల్లించాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్‌ చేశారు. ఆర్జీ –వన్‌ జీఎం కార్యాల యం ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. జీఎం లలిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మడ్డి ఎల్లా గౌడ్‌, పోశం, మోహన్‌, మహేశ్‌, రంగు శ్రీను, వెంకట్‌రెడ్డి, సతీశ్‌బాబు, రాజు, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు. ఇవే డిమాండ్లపై ఆర్జీ–2 జీఎం ఆఫీస్‌ ఎదుట కూడా ధర్నా ని ర్వహించారు. నాయకులు ఎల్‌.ప్రకాశ్‌, రాజరత్నం, రవీందర్‌, అన్నారావు, మహేందర్‌, సంపత్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

చెరువులు.. నిండుకుండలు

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): గత ఆగస్టు నుంచి ఈనెలలో ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని జలవనరులు నిండి నిండుకుంల్లా తయారయ్యాయి. ఈ వానాకాలంలో సాగుచేసిన పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలతోపాటు వచ్చే యాసంగి పంటలకూ సాగునీటికి ఢోకాలేకుండాపోయింది. జిల్లాలో సుమారు 1,021 చెరువులు, కుంటలు ఉండగా.. 408 వరకు పూర్తిగా నీటితో నిండి జలకళ సంతరించుకున్నాయి. 613 వరకు మత్తడి దూకుతున్నట్లు అధికారులు తెలిపారు.

స్వదేశీ సాంకేతికత భేష్‌ 
1
1/4

స్వదేశీ సాంకేతికత భేష్‌

స్వదేశీ సాంకేతికత భేష్‌ 
2
2/4

స్వదేశీ సాంకేతికత భేష్‌

స్వదేశీ సాంకేతికత భేష్‌ 
3
3/4

స్వదేశీ సాంకేతికత భేష్‌

స్వదేశీ సాంకేతికత భేష్‌ 
4
4/4

స్వదేశీ సాంకేతికత భేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement