
వంతెనల నిర్మాణానికి రూ.5 కోట్లు
● ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పని చేస్తున్నానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. నియోజకవర్గంలోని ఆరు ప్రాంతాల్లో హైలెవల్ వంతెనల కోసం ప్రభుత్వం నుంచి రూ.5కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ నుంచి రాఘవాపూర్ మార్గంలో అగుల్ల ఒర్రైపె రూ.కోటి వ్యయంతో వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే రాఘవాపూర్ నుంచి రంగాపూర్ మార్గంలోని జాలు కాలువపై రూ.50లక్షలతో, శ్రీరాంపూర్ మండలం తారుపల్లి–మీర్జంపేట నడుమ నక్కలవాగుపై రూ. కోటి 25లక్షలతో, జూలపల్లి మండలం కీచులాటపల్లి–వడ్కాపూర్ మార్గంలోని చెరువు మత్తడి వద్ద రూ.50లక్షలతో లోలెవల్ వంతెన, ఎలిగేడు మండలం శివపల్లి–నర్సయ్యపల్లి మార్గంలోని ఊర చెరువు కెనాల్‌పై రూ.85లక్షలతో హైలెవల్ వంతెన, సుల్తానాబాద్ మండలం కనుకుల–గుండ్లపల్లి నడుమ చెరువు రోడ్‌లో రూ.90లక్షలతో వంతెన నిర్మాణాల పనులు చేపట్టనున్నట్లు వివరించారు.