
స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు..
గోదావరిఖని: నిజాం నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజును తెలంగాణ ప్రజాపాలన దినంగా నిర్వహిస్తున్నామని సింగరేణి ఆర్జీ –వన్ జీఎం లలిత్‌కుమార్ అన్నారు. గోదావరిఖనిలోని ఆర్జీ – వన్ జీఎం కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించగా, జీఎం జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. ఐఈడీ ఏజీఎం ఆంజనేయులు, క్వాలిటీ అధికారి బ్రహ్మాజీ, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సర్వే డీజీఎం జీఎల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్జీ–2 ఏరియాలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం రా ముడు, ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, సివిల్ డీజీఎం ధనుంజయ్, ఏరియా రక్షణాధికారి సంతోష్‌కుమార్, ఎస్టేట్ అధికారి సునీత, పర్సనల్‌అధికారి సాధన్ తదితరులు పాల్గొన్నారు.