
దేశ నిర్మాణంలో ఇంజినీర్లపాత్ర అద్వితీయం
● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
జ్యోతినగర్(రామగుండం): దేశ నిర్వాణంలో ఇంజి నీర్లపాత్ర అద్వితీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ఇంజినీర్స్ డే సందర్భంగా ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని కాకతీయ ఆడిటోరియంలో ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీపీసీ ఎగిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంతతో కలిసి సీపీ జ్యోతి ప్రజ్వలన చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేశారు. సీపీ మాట్లాడుతూ, ఎన్టీపీసీ వెలుగులు అందించడంలో దేశంలో అగ్రభాగాన నిలిచిందన్నారు. నూతన సాంకేతిక విధానాలతో విద్యుత్ ఉత్పత్తిని చేపట్టేందుకు ఇంజినీర్లు చేస్తున్న కృషి అమోఘమని అన్నారు. సీపీని ఎన్టీపీసీ ఈడీ చందన్‌కుమార్ సా మంత శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అ నంతరం జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రతినిధులు నితీశ్‌కుమార్, మహేంద్రకుమార్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.