
అటవీ అమరుల సేవలు మరువలేనివి
పెద్దపల్లిరూరల్: అడవులను కాపాడేందుకు అమరులైన వారందరి సేవలు మరువలేనివని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా అటవీ అధికారి శివయ్య పాల్గొన్నారు. అడవుల సంరక్షణ కోసం అసువులు బాసి అమరులైన అధికారులను స్మరిస్తూ భవిష్యత్తు తరాలకోసం పాటుపడేలా అంకితభావంతో పనిచేయాలన్నారు. కలెక్టరేట్ నుంచి పెద్దపల్లి పట్టణ పురవీధుల మీదుగా ర్యాలీ సాగింది. కార్యక్రమంలో పలువురు అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు
జూలపల్లి(పెద్దపల్లి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేష న్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఠాణా పరిసరాలను పరిశీలించి, ఆవరణలో మొక్క నాటారు. అనంతరం రికార్డులు తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారులతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆదేశించా రు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై సనత్‌కుమార్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి టీఎల్‌ఎంకు ఎంపిక
రామగిరి(మంథని): రాష్ట్రస్థాయి టీచర్ లెర్నింగ్ మెథడ్ (టీఎల్‌ఎం)కు రామగిరి మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. గురువారం జిల్లాలో 140 మంది ఉపాధ్యాయులు టీఎల్‌ఎంను ప్రదర్శించారు. వీరిలో 8 మంది రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా, రామగిరి మండలం పన్నూరు ప్రభుత్వ పాఠశాల గణితం టీచర్ కందునూరి కవిత, వెంకట్రావుపల్లె పాఠశాల టీచర్ మయూర్‌ఆలం ఎంపికయ్యారు. వీరిని డీఈవో మాధవి, ఎంఈవో కొమురయ్య అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
విజయోత్సవ సభ ఏర్పాటు అభినందనీయం
కమాన్‌పూర్(మంథని): మండలంలోని గుండారం రిజర్వాయర్ వద్ద ఇటీవల జరిగిన గణనాథుల నిమజ్జనాన్ని విజయవంతం చేసి విజయోత్స సభ నిర్వహించడం అభినందనీయమని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. మండలకేంద్రంలోని ఆదివరాహస్వామి కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సభలో మాట్లాడారు. కొన్నేళ్లుగా రిజర్వాయర్‌లో ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్న అధికారులు, గ్రామస్తులకు అభినందనలు తెలిపి సన్మానం చేశారు. ఎంపీడీవో లలిత, తహసీల్దార్ వాసంతి తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
గోదావరిఖని(రామగుండం): లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని, ఈ నెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. చిన్నచిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. రాజీపడదగిన కేసులను పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు గుర్తించి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు.

అటవీ అమరుల సేవలు మరువలేనివి

అటవీ అమరుల సేవలు మరువలేనివి