165 టన్నుల బియ్యం | - | Sakshi
Sakshi News home page

165 టన్నుల బియ్యం

Sep 1 2025 10:19 AM | Updated on Sep 1 2025 10:19 AM

165 ట

165 టన్నుల బియ్యం

● కొత్తరేషన్‌ కార్డుదారులకు పంపిణీ ● జిల్లాలో పెరిగిన సెప్టెంబర్‌ నెల కోటా ● నేటినుంచి పంపిణీకి డీలర్ల ఏర్పాట్లు

జిల్లా సమాచారం

సంతోషంగా ఉంది

14వేల కార్డులు..

పెద్దపల్లిరూరల్‌: కొత్తగా పెళ్లయిన వారు.. కుటుంబం నుంచి విడిపోయి వేరే కాపురం పెట్టిన కొత్త దంపతులు వేలాది మంది మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసి కొత్త రేషన్‌కార్డుల కోసం ఏళ్లకేళ్లుగా నిరీక్షించారు. అయినా, కొత్తకార్డులు అందలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు కొత్తరేషన్‌కార్డులు అందజేయడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

జిల్లాలో 413 రేషన్‌దుకాణాలు..

జిల్లాలోని 14 మండలాలల్లో రేషన్‌కార్డుదారులకు ప్రతీనెల 413 రేషన్‌దుకాణాల ద్వారా డీలర్లు బి య్యం పంపిణీ చేస్తున్నారు. 2025 జూన్‌ వరకు 2,23,553 రేషన్‌కార్డులు ఉన్నాయు. ఇందులో 6,66,912 మంది ఈ ఏడాది జూన్‌లో(జూన్‌, జూ లై, ఆగస్టు) మూడు నెలల బియ్యాం కోటాను ఒకే సారి తీసుకున్నారు.

పథకాల ప్రచారం కోసం ‘చేతిసంచి’

దివంగత సీఎం వైస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రేషన్‌దుకాణాల ద్వారా బియ్యంతోపాటు 9 రకాల నిత్యావసరాలను చేతిసంచిలో ఉంచి కార్డుదారులకు అందించారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అన్ని సరుకులేవీ అందించకున్నా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలతో కూడిన చేతి సంచిని ప్రతీ రేషన్‌కార్డుదారుకు అందించాలని నిర్ణయించింది. చేతిసంచిపై సీఎం, డెప్యూటీ సీం, సివిల్‌ సప్లయి మంత్రి ఫొటో ముద్రించారు.

సరుకులిస్తారా.. సమ్మె చేస్తారా?

తమకు ఐదు నెలల కమీషన్‌ అందక ఇబ్బందులు పడుతున్నామని గత సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ శ్రీహర్షకు రేషన్‌ డీలర్లు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం కమీషన్‌ చెల్లింపులో జాప్యం చేస్తే సెప్టెంబర్‌ కోటా బియ్యం పంపిణీ చేయకుండా సమ్మె చేస్తామని డీలర్ల సంఘం నాయకుడొకరు తెలిపారు. అయితే, కొత్తకార్డుదారులు సంతోషంతో బి య్యం కోసం ఎదురు చూస్తుండగా.. డీలర్లు సరుకు లిస్తారో.. సమ్మెకు వెళతారోననే మీమాంస నెలకొంది.

మండలాలు 14

గ్రామపంచాయతీలు 266

రేషన్‌ దుకాణాలు 413

మొత్తం రేషన్‌కార్డులు 2,38,438

ఇందులో కొత్తగా మంజూరైనవి 14,885

పెరిగిన యూనిట్లు 27,559

పెరిగిన బియ్యం కోటా(మెట్రిక్‌ టన్నుల్లో) 165

కొత్తకార్డులు 14,843

జిల్లాలో కొత్త రేషన్‌కార్డులు 14,843 మంజూర య్యాయి. వీటిద్వారా 27,559 మంది లబ్ధిదారు లు సెప్టెంబర్‌ నుంచి బియ్యం తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్కరికి 6 కేజీ ల చొప్పున మొత్తం 165 మెట్రిక్‌ టన్నుల బి య్యం అదనంగా పంపిణీ చేయనున్నారు. ఇప్ప టికే సెప్టెంబర్‌ కోటా సన్నబియ్యం రేషన్‌ డీలర్లకు చేరవేశారు. జిల్లాలో సెప్టెంబర్‌లో మొత్తం 2,38,438 తెల్లరంగు రేషన్‌కార్డులపై 6,94,471 మంది పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తారు.

రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్లతరబడి నిరీక్షించాం. కాంగ్రెస్‌ ప్రభుత్వ రావడంతో మాకు కొత్త రేషన్‌కార్డు మంజూరైంది. ఎమ్మెల్యే, అధికారులు కొత్తకార్డు అందించారు. కొత్తకార్డు రావడం సంతోషాన్నిచ్చింది.

– వాత్సల్య, కొత్త రేషన్‌కార్డుదారు

165 టన్నుల బియ్యం1
1/1

165 టన్నుల బియ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement