సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక యాదవనగర్ పెరికె గిద్దెహనుమాండ్ల ఆలయంలో సివిల్ జ డ్జి గణేశ్ ఆదివారం పూజలు చేశారు. జడ్జి దంపతులు తొలుత గోవులకు దాణా అందజేశా రు. అనంతరం జడ్జి దంపతులను గోశాల వ్య వస్థాపక అధ్యక్షుడు బండారి సూర్యం, న్యాయవాదులు లెక్కల గంగాధర్, కరుణాకర్, నాయ కులు పన్నాల సతీశ్ ఘనంగా సన్మానించారు.
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఆదివారం గణేశ్ నిమజ్జన వేడుకలు ఘ నంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రత్యేకపూజలు చేసి గణనాథునికి వీడ్కోలు పలికారు. ఆర్‌ఐ శ్రీనివాస్, సీసీ హరీశ్, ఆర్‌ఎస్‌ఐ పోచలింగం, స్పెషల్ పార్టీ, ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ‘టాస్క్’ శి క్షణ కేంద్రంలో సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు దక్కేలా చూస్తున్నామని రీ జినల్ సెంటర్ ఇన్‌చార్జి కౌసల్య తెలిపారు. జా వా వెబ్ డెవలప్‌మెంట్ పైతాన్, సీసీ, హెచ్‌టీ ఎంఎల్, సీఎస్‌ఎస్, జావాస్క్రిప్ట్, టాలివిత్ జీ ఎస్టీ, అప్టిట్యూడ్ రీజనింగ్ సాఫ్ట్ స్కిల్స్‌పై కో చింగ్ ఇస్తామన్నారు. ఆసక్తి గలవారు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈనెల 2లోగా తమ పే ర్లను టాస్క్ సెంటర్‌లో నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 90595 06807 నంబరులో సంప్రదించాలని సూచించారు.
సుల్తానాబాద్(పెద్దపల్లి): విద్యార్థులు చదవడాన్ని అలవాటుగా చేసుకోవడం లక్ష్యంగా పా ఠశాల విద్యా శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీ కారం చుట్టింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ల్లో ఈనెల 1 నుంచి 15వ తేదీ వరకు పఠనోత్సవం(రీడింగ్ క్యాంపెయిన్) నిర్వహించాలని ఆ దేశించింది. ఇందులో భాగంగా 30 నిమిషాలపాటు విద్యార్థులను పాఠాలు చదివిస్తారు. పా ఠ్యపుస్తకాలు, కథల పుస్తకాలు, దినపత్రికలు, వార, మాసపత్రికలు వంటివి ఇందులో ఉన్నా యి. అంతేకాదు.. కథలు సృష్టించడంపైనా వర్క్‌షాప్‌లు నిర్వహించాలని ప్రభుత్వం సూచించిందని ఎంఈవో రాజయ్య తెలిపారు.
పెద్దపల్లిరూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజి టెడ్, కార్మికుల పింఛన్ సమస్యపై చర్చించేందుకు సోమవారం హైదరాబాద్‌లో సోమవా రం జరిగే ఆత్మగౌరవ సభకు తరలిరావాలని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, జేఏసీ చైర్మన్ తూము రవీందర్ కోరా రు. జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో సభ ప్రచార పోస్టర్ ఆవిష్కరించి మా ట్లాడారు. సెప్టెంబర్ ఒక టో తేదీన పింఛన్ విద్రోహదినంగా పాటించాలని వారు కోరారు.
రామగుండం: స్థానిక 62.5 మెగావాట్ల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం భూముల పరిరక్షణకు వి ద్యుత్ సౌధ ప్రత్యేక దృష్టి సారించింది. అతి వి లువైన స్థలాలు కబ్జాకు గురికాగా, మరికొన్ని ఆక్రమణల పాలయ్యే అవకాశం ఉంది. దీంతో రూ.4 కోట్ల వ్యయంతో చుట్టూ ప్రహరీ నిర్మాణానికి పూనుకుంది. ఇందుకోసం లేజర్ లెవ ల్, స్పిరిట్ లెవల్ యంత్రాలతో కచ్చితత్వంతో హద్దులు ఏర్పాటు చేసింది. విద్యుత్‌నగర్, సీకా లనీ వద్ద పనులు ప్రారంభమయ్యాయి.
గోశాలలో సివిల్ జడ్జి
గోశాలలో సివిల్ జడ్జి