
పేదల సంతోషమే ముఖ్యం
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోంది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్కరేషన్‌కార్డు కూడా ఇయ్యలే. కానీ సీఎం రేవంత్‌రెడ్డి అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేశారు. కార్డులు తీసుకునే కొత్త లబ్ధిదారుల ముఖాల్లో పట్టరాని సంతోషం కనిపించింది. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.
– చింతకుంట విజయరమణారావు,
ఎమ్మెల్యే, పెద్దపల్లి
కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం రేషన్‌కార్డులు మంజూరు చేసింది. దీంతో రేషన్ డీలర్లకు కొంచెం కోటా పెరిగింది. లబ్ధిదారులకు ప్రతీనెల సరుకులు పంపిణీ చేస్తున్న మాకు సకాలంలో కమీషన్ చెల్లించడం లేదు. వీలైనంత త్వరగా కమీషన్ చెల్లించాలి. గౌరవవేతనం ఇవ్వాలి.
– ఎలబోతారం శంకర్,
రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు
జిల్లాలో కొత్తగా 14,885 రేషన్ కార్డుల ద్వారా 27,559 యూనిట్లకు సరిపడా సన్నబియ్యం కోటా సెప్టెంబర్ నుంచి పంపిణీ చేస్తాం. రేషన్‌కార్డులందరికీ (కొత్తవారితో కలిపి) పంపిణీ చేసేందుకు అవసరమైన కోటాను రేషన్ దుకాణాలను చేరవేశాం. సెప్టెంబర్ నెలనుంచి కొత్తకార్డుదారులు సన్నబియ్యం పొందుతారు.
– శ్రీనాథ్‌రెడ్డి,
జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్

పేదల సంతోషమే ముఖ్యం