
లోతట్టు ప్రాంతాలు.. డ్రైనేజీ నిర్మాణంతో ఇబ్బందులు
రామగుండం: కొత్త మురుగునీటి కాలువ నిర్మాణంతో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు భావించినా మరింత జటిలమవుతోంది. శ్రీభక్తాంజనేయస్వామి మె యిన్ రోడ్డు వెంట దాదాపు ఐదు దశాబ్దాల క్రి తం నివాసాలు నిర్మించుకున్నారు. కొన్ని రో డ్డుకు సమానంగా, మరికొన్ని లోతట్టులో ఉండడంతో మురుగునీరు కొత్త డ్రైనేజీలోకి చేరడంలేదు. నేరుగా తమ ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పెద్దపల్లిరూరల్: పాత పింఛన్ విధానం అమ లు చేయాలనే డిమాండ్‌తో రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవా రం ధర్నా చేశారు. నాయకులు మహేశ్‌కుమార్, సుమన్, రాజిరెడ్డి, సంతోష్‌సింగ్ పాల్గొన్నారు.
ఓదెల(పెద్దపల్లి): రోడ్ల వెంట మొక్కలు నాటి సంరక్షించాలని జెడ్పీ సీఈవో నరేందర్ సూచించారు. కొలనూర్, మడక, పొత్కపల్లి, కనగర్తి తదితర గ్రామాల్లో ఆయన సోమవారం పర్యటించారు. రోడ్లకు ఇరువైపులా మీటరు దూరంలో మొక్కలు ఊతకర్రను రక్షణగా ఏర్పాటు చేయాలన్నారు. ఎంపీడీవో తిరుపతి, ఎంపీవో సబ్బీర్‌పాషా, కార్యదర్శిలు పాల్గొన్నారు.
గోదావరిఖని: ఆర్జీ –వన్ ఏరియాలో రక్షణపై డీజీఎంఎస్ అధికారుల సోమవారం వర్క్‌షాప్ నిర్వహించారు. మ్యాన్ రైడింగ్ చైర్‌కార్ సిస్టమ్ వినియోగ అనుమతులు, డంపర్ల బ్రేకింగ్ సిస్ట మ్, చట్టబద్ధమైన నిబంధనలపై భద్రతపై ఇందులో చర్చించారు. కార్యక్రమంలో అధికారులు పీకే జైన్, దిలీప్‌కుమార్, రఘురామ్‌రెడ్డి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
లారీ డ్రైవర్ల నిరసన
మంథనిరూరల్: క్వారీలో ఇసుక లోడింగ్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ లారీ డ్రైవర్లు సోమవారం అడవిసోమన్‌పల్లి గ్రామ శివారులోలని మంథని – కాటారం ప్రధాన రహదారిపై బైఠాయించారు. నిర్వాహ కుల తీరుపై నిరసన తెలిపారు. దూరప్రాంతాల నుంచి వస్తే క్వారీ నిర్వాహకులు లారీల్లో ఇసుక లోడింగ్ చేయడం లేదన్నారు. కుటుంబాలను వదిలి రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో నానాతంటాలు పడ్డామని వాపోయారు. క్వారీ యాజమాన్యం, నిర్వాహ కులు తమ కష్టాలను, ఇబ్బందులను గుర్తించి లోడింగ్ సమస్య పరిష్కరించాలని కోరారు.
ఉపాధి పనుల్లో కూలీలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఉపాధిహామీ కూలీ లు పనులు సద్వినియోగం చేసుకోవడం మంచిపరిణామమని డీఆర్డీవో కాళిందిని అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జరిగిన సామాజిక తనిఖీ సభలో ఆమె మాట్లాడా రు. ఇప్పటికే సీసీ, లింక్‌రోడ్లకు సంబంధించిన 505 పనులను రూ.3కోట్ల 33 లక్షలు వెచ్చించి పూర్తిచేశామని, పంచాయతీరాజ్‌కు సంబంధించి 54 రోడ్లను రూ.2 కోట్ల 70 లక్షలు వెచ్చించి పూర్తి చేశామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, విజిలెన్స్ కమిటీ సభ్యుడు కొమురయ్యగౌడ్, అబుడ్స్‌మన్ శరత్‌కుమార్, క్వాలిటీ కంట్రోలర్ హరికృష్ణ, ఎస్‌ఆర్ మౌనిక, ఏపీవో మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

లోతట్టు ప్రాంతాలు.. డ్రైనేజీ నిర్మాణంతో ఇబ్బందులు

లోతట్టు ప్రాంతాలు.. డ్రైనేజీ నిర్మాణంతో ఇబ్బందులు

లోతట్టు ప్రాంతాలు.. డ్రైనేజీ నిర్మాణంతో ఇబ్బందులు

లోతట్టు ప్రాంతాలు.. డ్రైనేజీ నిర్మాణంతో ఇబ్బందులు