ఆవిష్కరణలకు అడుగులు
● రోబోల రూపకల్పనకు శిక్షణ
● జిల్లాలోని 9 మోడల్ స్కూళ్ల ఎంపిక
● 1,193 మంది విద్యార్థులకు తర్ఫీదు ● రోబోల నిర్మాణం: డిజైన్ కోసం విడిభాగాలు, గేర్‌లు, మోటార్లు వంటివి ఉపయోగించడం
● ప్రోగ్రామింగ్: ఆర్డ్‌నో, రాస్ప్ బెర్రీ, స్క్రాచ్, పైథాన్ వంటి ప్లాట్‌ఫామ్స్‌పై రోబోట్‌లను నియంత్రించడానికి కోడింగ్ నేర్పించడం..
● సెన్సార్లు/ఎలక్ట్రానిక్స్: అల్ట్రాసోనిక్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు, ఎల్‌ఈడీలు, సర్క్యూట్ డిజైన్ వంటి ఎలక్ట్రానిక్ విడిభాగాలపై శిక్షణ
● ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్: రోబోట్‌లను ఇంటర్నెట్ తో అనుసంధానించి డేటా సేకరించడం, నియంత్రణ చేయడం
● త్రీడీ ప్రింటింగ్: రోబో విడి భాగాలు డిజైన్ చేయడం, తయారు చేయడం.
● ప్రాజెక్టు, బేస్డ్ లెర్నింగ్: సొంతంగా చిన్న రోబోలు, ఆటోమేటెడ్ సిస్టమ్స్ సమస్యలు పరిష్కరించే ప్రాజెక్టుల తయారీ
● ఏఐ ఇంటిగ్రేషన్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రోబోటిక్స్‌ను కలిపి శిక్షణ ఇవ్వడం
● సాఫ్ట్ స్కిల్స్: టీమ్ వర్క్, సమస్యల పరిష్కార నైపుణ్యాలు, డిజైన్ థింకింగ్, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడం.
రామగుండం: అటల్ టింకరింగ్ ల్యాబ్(ఏటీఎల్), అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం) ద్వారా విద్యార్థుల్లోని సృజనకు పదును పెట్టడం.. ఆలోచనా శక్తి పెంపొందించడం.. డిజైన్ మైండ్‌సెట్ వృద్ధి చే యడం.. కంప్యూటేషన్ థింకింగ్ వంటి నైపుణ్యాలు మెరుగుపర్చడం లక్ష్యంగా సర్కార్ స్కూళ్లలోని చు రుకైన విద్యార్థులకు రోబోటిక్స్ తయారీపై శిక్షణ ఇ చ్చేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు జిల్లాలోని తొమ్మిది మోడల్ స్కూళ్లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసింది. అందులో ఎనిమిది, తొమ్మి దో తరగతి చదువుతున్న 1,193 మంది విద్యార్థులను గుర్తించింది. నెలలో ఒకరోజు చొప్పున వీరికి ఏడు నెలల పాటు శిక్షణ ఇవ్వనుంది. ఒకరోజు బోధన, మిగతా రోజుల్లో సాధన చేసేలా కార్యాచరణ రూపొంచింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వైజ్ఞా నిక దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణలను ప్రదర్శించేలా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
శిక్షణ ఇచ్చే అంశాలు..