
భారీకాయం.. తీరొక్క రూపం
ఆదిదేవుడు గణపయ్య నిత్యపూజలు అందుకుంటున్నాడు. భక్తులు ధూప, దీప నైవేద్యాలతో పూజిస్తూ తమ కుటుంబాలను సల్లంగా చూడాలని వేడుకుంటన్నారు. తీరొక్క రూపంలో కొలువుదీరిన వినాయకుడు.. భక్తులకు దర్శనమిస్తున్నాడు. జిల్లాకేంద్రంలో 61 అడుగుల భారీమట్టి విఘ్నేశ్వరుడు.. ఏడుకొండల వెంకటేశ్వరుని రూపంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రంలోని చాలామంది భక్తులు భారీ మట్టిగణనాథుని చూసేందుకు తరలివస్తున్నారు. గోదావరిఖని, సుల్తానాబాద్, మంథని తదితర ప్రాంతాల్లోనూ వివిధ రూపాల్లో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఈసందర్భంగా భక్తులు ఆదివారం దీపాలంకరణ చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

భారీకాయం.. తీరొక్క రూపం

భారీకాయం.. తీరొక్క రూపం

భారీకాయం.. తీరొక్క రూపం